ఎస్సీ, ఎస్టీలపై నేరాలు తగ్గుముఖం

అట్రాసిటీ కేసులపై పోలీసులు వెంటనే స్పందిస్తున్నారు

రాష్ట్ర విభజన తర్వాత ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ మొట్ట‌మొద‌టి సమావేశం

అట్రాసిటీ కేసులపై సీఎం వైయస్‌ జగన్‌ సుదీర్ఘంగా చర్చించారు

హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత

సచివాలయం: రాష్ట్ర‌‌ విభజన తరువాత స్టేట్‌ లెవెల్‌ హైపవర్ ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ మొట్ట‌మొద‌టి సమావేశం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అధ్యక్షతన జరిగిందని హోంమంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. రాష్ట్రంలోని అట్రాసిటీ కేసులు, పరిష్కారాలపై సీఎం వైయస్‌ జగన్‌ చాలా సుదీర్ఘంగా చర్చించారన్నారు. ప్రతి ఏడాది రెండుసార్లు సమావేశం కావాల్సి ఉన్నా.. గ‌త ప్ర‌భుత్వం ఐదేళ్లలో ఒక్కసారి కూడా సమావేశం నిర్వహించకపోవడం అంటే వారికి ఎస్సీ, ఎస్టీలపై ఉన్న చిత్తశుద్ధి ఎలాంటిదో అర్థం అవుతుందన్నారు. 

రాష్ట్ర స్థాయి హైపవర్‌ ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం అనంతరం హోంమంత్రి సుచరిత మీడియాతో మాట్లాడుతూ.. తప్పు ఎవరు చేసినా క్షమించకూడదని, చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీల తొలి సమావేశంలోనే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చెప్పారని గుర్తుచేశారు. అట్రాసిటీ కేసులపై పోలీసులు వెంటనే స్పందిస్తున్నారన్నారు. గతంలో పోలిస్తే ఎస్సీ, ఎస్టీలపై జరిగే నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి 1.1 శాతం మాత్రమే నేరాలు నమోదయ్యాయన్నారు. గతంలో విచారణ సమయం చాలా ఎక్కువగా ఉండేదని, ఇప్పుడు 50 రోజుల్లోనే అట్రాసిటీ కేసుల్లో నిందితులపై యాక్షన్‌ తీసుకుంటున్నామని చెప్పారు. 

అట్రాసిటీ కేసుల్లో విచారణ పూర్తయి నిందితులకు శిక్ష విధించడంలో గతంలో 3.6 శాతం ఉంటే.. ప్రస్తుతం 7 శాతానికి పెరిగిందన్నారు. కేసుల విచారణ ఇంకా వేగవంతం చేయాలని సీఎం సూచించారని, ఇప్పుడున్న పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌లకు అదనంగా అట్రాసిటీ కేసులను విచారించేందుకు మరికొందరిని నియమించాలని సీఎం సూచించారన్నారు. అదే విధంగా దిశ యాక్ట్‌లో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లను అట్రాసిటీ కేసుల విచారణకు కూడా ఉపయోగించుకోవాలని, ల్యాబ్‌లను త్వరగా ఏర్పాటు చేయాలని ఆదేశించారని చెప్పారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top