సీఎం వైయస్‌ జగన్‌తో హైపవర్ కమిటీ భేటీ

తాడేపల్లి : రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై చర్చించేందుకు ఏర్పాటైన హైపవర్‌ కమిటీ శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశం అయింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరుగుతుంది. జీఎన్‌ రావు, బీసీజీ నివేదికలను పరిశీలించిన హైపవర్‌ కమిటీ సభ్యులు.. సీఎం వైయస్‌ జగన్‌కు పవర్‌ ప్రజంటేషన్‌ ఇవ్వనున్నారు. అలాగే రాజధాని రైతుల సమస్యలపై హైపవర్‌ కమిటీ సభ్యులు సీఎం వైయస్‌ జగన్‌తో చర్చించనున్నారు. ఇప్పటికే మూడు సార్లు సమావేశమైన హైపవర్‌ కమిటీ సభ్యులు జీఎన్‌ రావు, బీసీజీ నివేదికలపై విస్తృతంగా చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. 

Back to Top