కాసేపట్లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ఉన్నతస్థాయి సమీక్ష

కోవిడ్ క‌ట్ట‌డిపై మంత్రులు, ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేయనున్న సీఎం 

తాడేపల్లి: కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కాసేపట్లో అత్యున్నతస్థాయి సమీక్షా సమావేశం ప్రారంభం కానుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. కోవిడ్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై కేబినెట్‌ సబ్‌ కమిటీ సభ్యులు, ఉన్నతాధికారులతో సీఎం వైయస్‌ జగన్‌ చర్చించనున్నారు. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని నేతృత్వంలో జరిగిన కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం నివేదికను మంత్రులు సీఎం వైయస్‌ జగన్‌కు అందించనున్నారు. పూర్తిస్థాయిలో కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధతపై ఈ ఉన్నతస్థాయి సమీక్షలో చర్చించనున్నారు. మంత్రులు, ఉన్నతాధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు. 

Back to Top