హెల్త్ కార్డుల డిజిట‌లైజేష‌న్‌లో ఏపీకి ప్రథమస్థానం

అవార్డును సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అందించిన మంత్రి ర‌జ‌ని

వైద్య ఆరోగ్య శాఖ అధికారుల‌కు ముఖ్య‌మంత్రి అభినంద‌న‌లు

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌ని తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఇటీవల ద ఎకనమిక్‌ టైమ్స్‌ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన డిజిటెక్‌ కాన్‌క్లేవ్‌ 2022లో పాల్గొని, ప్రజల హెల్త్‌ రికార్డుల డిజిటలైజేషన్‌లో దేశంలోనే ప్రథమ స్ధానంలో నిలిచినందుకు రాష్ట్రానికి వచ్చిన అవార్డును మంత్రి విడ‌ద‌ల ర‌జ‌ని అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రానికి వచ్చిన అవార్డుని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కు మంత్రి ర‌జ‌ని చూపించారు. ఈ మేర‌కు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అభినందించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top