సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు హజ్‌ పవిత్ర జలం అంద‌జేత‌

తాడేప‌ల్లి: సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ను హ‌జ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీలు, హజ్‌ కమిటీ సభ్యులు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా హజ్‌ పవిత్ర జలం (జమ్‌ జమ్‌ వాటర్‌)ను సీఎంకు అందజేశారు. హజ్‌ 2022 యాత్ర ముగిసిన సందర్భంగా పవిత్ర జలం (జమ్‌ జమ్‌ వాటర్‌)ను సీఎంకి అందజేసి మైనారిటీలకు సంబంధించి పలు అంశాలు ప్రస్తావించారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రిని కలిసినవారిలో హజ్‌ కమిటీ ఛైర్మన్‌ బీఎస్‌.గౌస్‌ లాజమ్, ఎమ్మెల్సీలు రుహుల్లా, ఇషాక్‌ బాషా, హజ్‌ కమిటీ సభ్యులు మునీర్‌ బాషా, ఇమ్రాన్, ఇబాదుల్లా, ఖాదర్, ముఫ్తిబాసిత్‌ తదితరులు ఉన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top