కార్మిక శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన గుమ్మ‌నూరు

స‌చివాల‌యం: రాష్ట్ర‌ కార్మిక మంత్రిగా గుమ్మనూరు జయరాం మ‌రోసారి బాధ్యతలు స్వీక‌రించారు. స‌చివాల‌యంలో బుధవారం ఉదయం కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ప్రత్యేక పూజలు నిర్వహించి మంత్రిగా త‌న శాఖ‌ బాధ్యతలు చేప‌ట్టారు.  ఈ మేర‌కు మంత్రి గుమ్మ‌నూరుకు ప‌లువురు అభినంద‌న‌లు తెలిపారు. అనంతరం మంత్రి జ‌య‌రాం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారని, బీసీలంతా సీఎంకు అండగా ఉంటారన్నారు.  బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు సీఎం అధిక ప్రాధాన్యత‌ ఇచ్చారన్నారు. కార్మికులకు ఈఎస్ఐ ద్వారా వైద్యం అందించడంతో పాటు ఈ-ఔషధ ద్వారా పాదర్శక విధానం తీసుకొచ్చామని మంత్రి జ‌య‌రాం చెప్పుకొచ్చారు. 

తాజా ఫోటోలు

Back to Top