ఏపీకి కేంద్రం ఏమైనా ప్రత్యేకంగా ఇచ్చిందా?

మంత్రి అమర్నాథ్‌

ఏపీలో బీజేపీ.. టీజేపీగా మారిపోయింది

వైయ‌స్ఆర్‌సీపీకి ఏ పార్టీతోనూ పొత్తులేదు

టీడీపీ అవినీతికి బీజేపీ సమాధానం చెప్పదా?

 కనీసం ఒక్క సీటు లేని బీజేపీ 20 సీట్లు ఎలా ఆశిస్తుంది

విశాఖపట్నం: ఏపీకి కేంద్రం ఏమైనా ప్రత్యేకంగా ఇచ్చిందా? అని మంత్రి అమర్నాథ్ ప్ర‌శ్నించారు. కేంద్రహోం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలపై మంత్రి గుడివాడ అమర్నాథ్‌ స్పందించారు. స్టీట్‌ప్లాంట్‌పై అమిత్‌ షా మాట్లాకుండా వెళ్లిపోయారని అన్నారు. కేవలం విమర్శలు చేసేందుకే అమిత్‌ షా వచ్చినట్టు ఉంది అని విమర్శలు చేశారు. సోమ‌వారం మంత్రి అమ‌ర్నాథ్ విశాఖ‌లో మీడియాతో మాట్లాడారు.

 *విశాఖపై అమిత్‌ షా వ్యాఖ్యలను ఖండిస్తున్నా:*
కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డాలు మాట్లాడిన మాటలు చూసిన తర్వాత బీజేపీ కంటే టీడీపీ ఎక్కువ సంబరపడుతున్నట్లుంది. 
టీడీపీకి వత్తాసు పలుకుతున్న ఎల్లో మీడియాకు, టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని తాపత్రయం పడుతన్న వ్యక్తులు సంబరపడుతున్నట్లున్నారు. 
ఒంటరిగా పోటీ చేస్తారా.. అంటే సమాధానం చెప్పలేని వారు కూడా ఇప్పుడు ఈ అంశాలను వినియోగించుకోవాలి అనుకుంటున్నారు. 
ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మొత్తం కేంద్రమే చేస్తుందన్నట్లు చెప్పుకొచ్చారు. 
రాష్ట్రంలో నాలుగేళ్లుగా అవినీతి జరుగుతుందని, వైఎస్సార్సీపీ నాయకులు దోచేస్తున్నారని మాట్లాడతున్నారు. 
విశాఖపట్నంలో విద్రోహ శక్తులు ఉన్నట్లు బీజేపీ, అమిత్‌ షా మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. 

*విశాఖ స్టీల్స్‌ అమ్మేయాలనుకోవడమే ఒక పెద్ద స్కామ్‌:*
కేంద్రంలో తొమ్మిదేళ్ల వారి పరిపాలన సందర్భంగా విశాఖ వచ్చినప్పుడు రాష్ట్ర ప్రజలు ఆశించేది వేరుగా ఉంటుంది. 
అమిత్‌ షా వస్తున్నారు..స్టీల్‌ ప్లాంట్‌పై ఒక ప్రకటన చేస్తారని ఆశ పెట్టుకున్నారు. 
స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిలుపుదల చేస్తున్నామని చెప్తారని అందరూ భావించారు. 
ఏపీ ప్రజల సెంటిమెంట్‌గా ఉన్న విశాఖ స్టీల్‌ అంశాన్ని గౌరవించి ఏదో ప్రకటన చేస్తాడని అనుకున్నాం. 
స్టీల్‌ ప్లాంట్‌ అమ్మేయడానికి అడుగేసిన మీరు మా గురించి మాట్లాడటం హస్యాస్పదంగా ఉంది. 
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మేయాలని అనుకోవడమే ఒక పెద్ద స్కామ్‌. 
స్టీల్‌ ప్లాంట్‌కు 26 వేల ఎకరాల భూమి ఉంది..23 వేల మంది రైతులు ఆ రోజుల్లో భూములిచ్చి ప్లాంటు నిర్మాణానికి ముందుకొచ్చారు. 
30 మంది ప్రాణాలు అర్పించి సాధించిచుకున్న సంస్థ గురించి కనీసం ఒక్క మాట మాట్లాడలేదు కానీ..మమ్మల్ని మాత్రం విమర్శిస్తున్నారు. 
ఇంకో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి..మేమూ ఉన్నామని చెప్పుకోడానికి, ఉనికి కోసం విమర్శలు చేసినట్లు కన్పిస్తోంది. 

*మీరిచ్చే గౌరవాన్ని బట్టే మేమిచ్చే గౌరవం ఉంటుంది:*
ప్రధాని మోడీ విశాఖ వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌గారు రాష్ట్ర ఆకాంక్షలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. 
బీజేపీతో వైఎస్సార్సీపీకి అంతర్గతంగా అవగాహనలు ఉన్నాయని ఎల్లో మీడియా, కొన్ని పార్టీలు ప్రచారం చేశాయి.
ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీతో వైఎస్సార్సీపీకి ఏ రోజూ పొత్తు లేదు. 
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో ఉండాల్సిన సంబంధాల మేరకే మేం సంబంధాలు పెట్టుకున్నాం. 
వారు మాకు ఎంత గౌరవం ఇస్తే...మేమూ అంతే గౌరవం ఇస్తాం...
ఆ విధానంలోనే మేం ఉంటాం..లేదు మేం ఈ రకంగానే ఉంటాం అంటే మేం కూడా అలానే ఉంటాం. 
కేంద్రం డబ్బులతోనే ఈ రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. 
పింఛన్లను 65 లక్షల మందికి నెలకు రూ.2,750 ఇస్తున్నాం. దీనిలో కేంద్రం ఇచ్చేది రూ.200. 
అది కూడా 60 ఏళ్ల నుంచి 79 ఏళ్ల వరకూ ఉన్న వారికి రూ.200 వారు సాయం చేస్తారు. 
79 ఏళ్లు దాటిన వారికి రూ. 500 ఇస్తారు. మిగిలినదంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది...
రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.1800 కోట్లు పింఛన్ల పంపిణీకే ఖర్చు చేస్తోంది. 
మధ్యాహ్న భోజన పథకం కూడా మేమే చేస్తున్నామని బీజేపీ వారు చెప్పుకుంటున్నారు. 
మా ప్రభుత్వం 2021–22 సంవత్సరంలో మధ్యాహ్న భోజనం కోసం రూ.1500 కోట్లు ఖర్చు చేస్తే కేంద్రం నుంచి వచ్చింది కేవలం రూ.400 కోట్లు మాత్రమే. 
రేషన్‌ బియ్యాన్ని కేంద్రం ఇస్తే జగన్‌ గారి ఫోటో వేసుకుంటున్నారని విమర్శలు చేస్తున్నారు. 
రాష్ట్రంలో ఉన్న 1.50 కోట్ల రేషన్‌ కార్డుల్లో కేంద్రం రేషన్‌ ఇస్తున్నది కేవలం 85 నుంచి 90 లక్షల కార్డుదారులకు మాత్రమే.
మిగిలిన యాభై, అరవై లక్షల కార్డులకు కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తోంది. 
రేషన్‌ కార్డుల విషయంలో రాష్ట్ర విభజన సమయంలో జరిగిన నష్టం ఈ రోజుకీ కేంద్రం భర్తీ చేయలేదు. 

*కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో రాష్ట్ర వాటా లేదా..?:*
కేంద్రం నుంచి వస్తున్న డబ్బు కేవలం కేంద్రానిదే కాదు..రాష్ట్రం నుంచి కట్టిన పన్నులు కూడా దానిలో ఉంటాయి. 
మన రాష్ట్రం నుంచి కేంద్రానికి ఇవ్వాల్సిన ఆదాయాన్ని ఇస్తూనే ఉన్నాం. 
అన్ని రాష్ట్రాలకు కేంద్రం నుంచి నిధులు ఏ రకంగా వస్తున్నాయో అలానే మనకీ వస్తున్నాయి. 
ఇప్పుడేదో వీళ్లు కొత్తగా తీసుకొస్తున్న నిధులేమీ లేవు. 
ఆంధ్రప్రదేశ్‌కు ప్రేమతో ప్రత్యేకంగా ఇస్తున్నదేముందో చూపించండి. 
రైల్వే జోన్, ప్రత్యేక హోదా, పోలవరం వంటి వాటి నిధులు సరిగ్గా ఇవ్వడం లేదు. 
రాష్ట్ర విభజన సందర్భంలో విభజనలో భాగస్వామ్యులైన బీజేపీ వారు ఇవ్వాల్సినవి ఇవ్వకుండా ఏదేదో చెప్తున్నారు. 
ఐఐటీ, ఐఐఎం ఇచ్చాం అంటున్నారు. అవన్నీ పునర్విభజన చట్టంలో ఉన్నవే కదా..?
కొత్తగా ఆంధ్రప్రదేశ్‌ మీద ప్రేమతో ఇచ్చినది ఒక్కటి చెప్పమనండి..?

*2014–19 మధ్యలో ఇసుక తవ్వలేదా..? ఆ ఆదాయం ఎవరి జేబుల్లోకి వెళ్లింది..?:*
జగన్‌ గారు 2.16 లక్షల కోట్లు డీబీటీ ద్వారా సంక్షేమం అందించారు. ఇలాంటి ప్రభుత్వాన్ని దేశంలో ఒక్కదాన్ని చూపించండి..?
బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల్లో ఒక్క రూపాయి అవినీతి లేకుండా పేదవాడికి సంక్షేమం అందించిన ప్రనభుతవ్వాని చూపించండి..? 
గత నాలుగేళ్లలో ఏపీకి ఇసుక ద్వారా రూ.4వేల కోట్ల అదాయాన్ని తీసుకొచ్చాం. 
గడచిన ప్రభుత్వంలో ఒక్క రూపాయి రాలేదు. ఆ డబ్బంతా ఏమైనట్లు..? 
ఇదే తెలుగుదేశం, బీజేపీ ఆనాడు చెట్టాపట్టాలేసుకుని తిరిగాయి కదా..? 
కేంద్రంలో బీజేపీతో టీడీపీ అధికారాన్ని పంచుకుంది...రాష్ట్రంలో టీడీపీతో బీజేపీ అధికారాన్ని పంచుకుంది. 
2014–19 మధ్యలో ఇసుక తవ్వలేదా..? ఆ ఆదాయం ఎవరి జేబుల్లోకి వెళ్లింది..?
అవినీతి లేకుండా కట్టడి చేసి సంక్షేమాన్ని అందిస్తూ ప్రభుత్వం ముందడుగు వేస్తుంటే రాజకీయాలు చేస్తున్నారు. 

*మీ వేదికపై పుట్టుకతో బీజేపీలో ఉన్నవారు ఎవరైనా ఉన్నారా..?:*
సరే మీరంతా కలిసొస్తారో...విడివిడిగా పోటీ చేస్తారో మీ ఇష్టం..
నిన్న వేదిక మీద ఎవరన్నా పుట్టకతో బీజేపీలో ఉన్న వారు ఎవరైనా ఉన్నారా..? 
పోనీ..2014 నుంచి బీజేపీలో ఉన్న వారు ఎంత మంది స్టేజ్‌ మీద ఉన్నారు..? 
సుజనా చౌదరి, సీఎం రమేష్, పురందరేశ్వరి...వీళ్లా బీజేపీ నాయకులా..? 
2019లో చంద్రబాబు ఓడిపోయిన తర్వాత...ఆయన్ను కాపాడటానికి మీ పార్టీలోకి వచ్చిన టీ–బీజేపీ నేతలు వీళ్లంతా..
ఆ టీజేపీ నేతలంతా ఏదో స్క్రిప్ట్‌ ఇస్తే అమిత్‌ షా మాట్లాడుతున్నాడు. మీరెంతగా రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లాలని చూసినా మేం ఏం చేస్తున్నది ప్రజలకు తెలుసు.
మేం చేస్తున్న ఖర్చులో డబ్బైనా ఒక్క పైసా దుర్వినియోగం అయిందని చెప్పగలరా..? 
ఆనాడు టీడీపీతో కలిసి కాపురం చేస్తున్నప్పుడు కేంద్రం నుంచి వచ్చిన డబ్బంతా ఏమైంది..? 
చంద్రబాబు చేసిన రూ. 4లక్షల కోట్లకు పైగా తీసుకొచ్చిన అప్పుల డబ్బు ఏమైంది..? 
మేం గర్వంగా రూ.2.16 లక్షల కోట్లు పేదవాడి ఖాతాల్లోకి వెళ్లాయని చెప్పగలం. 
ఆనాడు విభజన చట్టం ప్రకారం వెనుకబడిన జిల్లాలకు ఏడాదికి ఇవ్వాల్సిన రూ.350 కోట్ల నిధులేవీ..? 
గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇదే నిధులు ఏమయ్యాయి..చంద్రబాబు లెక్క చెప్పాడా..? 

*అమరావతి పెద్ద స్కామ్‌ అన్నది మర్చిపోయారా..?:*
అమరావతి అనేది ఒక పెద్ద స్కామ్‌ అని చెప్పిన మాట ఈ బీజేపీ పెద్దలకు గుర్తులేదా..?
ఈ రోజు కొత్తగా అమరావతిని ఏం అభివృద్ధి చేశారు అని అడగడం విడ్డూరంగా ఉంది. 
విశాఖ వచ్చినప్పుడు స్టీల్‌ ప్లాంట్‌ గురించి కానీ, రైల్వే జోన్‌ గురించి కానీ మాట్లాడటం లేదు. 
రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా ప్రభుత్వం ప్రకటించిన దానిపై వారి అభిప్రాయం చెప్పలేదు. 
బీజేపీ 2001లో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు 3 కొత్త రాష్ట్రాలు ఏర్పాడ్డాయి. 
చత్తీస్‌ఘడ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్‌ రాష్ట్రాలకు అప్పటికే అభివృద్ధి చెందిన నగరాలనే రాజధానులుగా పెట్టారు. 
మీ పరిపాలనలో అప్పటికే అభివృద్ధి చెందిన నగరాలను రాజధానులుగా సూచించారు  కానీ...ఏమీ లేని అమరావతిలో రాజధాని ఎందుకు కట్టలేదని ప్రశ్నిస్తున్నారు.  
రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం, భూములు కొట్టేసి..మూడు పంటలేసుకుంటున్న రైతుల వద్ద నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారు. 
దాన్ని పెద్ద స్కామ్‌ అన్న ఈ పెద్ద మనుషులే ఇప్పుడొచ్చి అమరావతి గురించి మాట్లాడుతున్నారు. 

*ఏ రాజకీయ పార్టీ కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు:*
జగన్‌ గారు పార్టీ స్థాపించిన 2011 నుంచి ఈ రోజు వరకూ ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం కానీ, ఏ రాజకీయ పార్టీ వారి కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం కానీ లేదు. 
మేం అధికారంలోకి రావడానికి మీ సహకారం కావాలి అనే పరిస్థితులు ఏ రోజూ వైఎస్సార్సీపీకి రావు..ఆ అవసరం కూడా లేదు. 
మీరంతా కలిసి పోటీ చేస్తామంటే చేయండి...సమస్యే లేదు. 
చంద్రబాబుకి, బీజేపీకి, తోకపార్టీకి బలం లేక తాపత్రయపడి కలిసి పోటీచేయాలని ప్రయత్నం చేస్తున్నారు. 
ఇదే అమిత్‌ షా తిరుపతిలో రాళ్లిసిరి..ఈ రోజు పువ్వులిసురుతున్నారు..
ఇదే అమిత్‌షాను అసెంబ్లీలో నిలబడి చంద్రబాబు మీ సంగతి తేల్చేస్తానన్న చంద్రబాబు వాళ్ళ కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది. 
ఢిల్లీ చుట్టూ తిరగాల్సిన అవసరం ఏమొచ్చింది..?
ఒక పక్క దేశమంతా రైలు ప్రమాదంతో బాధలో ఉంటే ఈయన పొత్తుల కోసం ఢిల్లీ పరుగెట్టాడు. 
అమిత్‌ షా, నడ్డాలను కలిశానన్నారు కానీ...ఆ ఫోటోలేవీ బయటకు రాలేదు. 
ఆయన ఎవర్ని కలిసినా మాకేం అంభ్యంతరం లేదు. 

*జగన్‌ గారిని విమర్శిస్తే మీ పరపతి పెరగదు:*
రాష్ట్రంలో వైఎస్సార్సీపీని, జగన్‌ గారిని నాలుగు మాటలు అనేస్తే మీ పరపతి పెరుగుతుందనుకుంటే అది మీ అమాయకత్వం. 
మొన్నటి ఎన్నికల్లో మీకొచ్చిన ఓట్లు ఒక్క శాతం కూడా మించలేదు. 
ఒక్క సీటూ లేదు...పెద్ద ఓట్లూ లేవు..20 సీట్లు కావాలని అడుగుతున్నారు. 
అడగడంలో తప్పులేదు. మీ రాజకీయ పార్టీ ఎజెండా చెప్పుకునే అవకాశం రాజ్యాంగం మీకు కల్పించింది. 
మీరేం చేయగలరో చెప్పండి...అది మానేసి జగన్‌ గారిని తిడితే ఇక్కడేదో మీ పరపతి పెరుగుతుంది అనుకుంటే మీ అమాయకత్వం. 
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు గొప్ప కార్యక్రమాలు జగన్‌ గారు చేశారు. 
అనేక వ్యవస్థలు స్థాపించాం..అవన్నీ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. 
విద్య, వైద్యం వంటి రంగాలకు మేం ఏ రకమైన ప్రాధాన్యం ఇస్తున్నామో చూడండి. 
2019 వరకూ రాష్ట్రంలో 11 మెడికల్‌ కాలేజీలు ఉంటే..ఈ నాలుగేళ్లలో 17 మెడికల్‌ కాలేజీలు ఇచ్చాం.. 
2019 వరకూ 500 వరకూ పీజీ సీట్లుంటే..ఈ రోజు 1400 పీజీ సీట్లు తీసుకొచ్చాం. 
రాష్ట్రం అందరికీ ఆదర్శంగా కన్పిస్తుంటే..రాజకీయ విమర్శలు చేయడం సరికాదు. 
టీజేపీ టీమ్‌ను పెట్టుకుని మాట్లాడితే ఇలాంటి ఫలితమే వస్తుంది...
రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీగా వైఎస్సార్సీపీకి...కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ప్రభుత్వానికి, ప్రభుత్వానికి ఉన్న సంబంధం మాత్రమే. 
దాన్ని ఏదో ఒక విధంగా రాజకీయంగా ముడిపెట్టే ప్రయత్నం చేయవద్దు. 
మేం కూడా గౌరవంతో ఈ రోజు వరకూ ప్రవర్తించాం. 
మేం ఇచ్చే గౌరవం రాష్ట్ర ప్రయోజనాల కోసం..రాష్ట్రానికి రావాల్సిన అవసరాల కోసం. 
మీరిచ్చే గౌరవాన్ని బట్టే..మీకిచ్చే గౌరవం ఉంటుంది. 
రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని కళ్లు విప్పి చూడండి. 

ప్రత్యేక హోదా అంశంలో మేం ఢిల్లీ వేదికగా పోరాటాలు చేశాం. 
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు చేశాం. 
పోలవరం నిధులతో పాటు అన్ని సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. 
మొన్న పదివేల కోట్లు ఇస్తే ఎందుకు వీళ్లంతా గగ్గోలు పెట్టారు..? 
వాళ్ల దగ్గర వ్యవస్థలు ఉన్నాయి..విమర్శలు చేస్తుంది వారు..వారే నిరూపించమనండి. 
మాకూ, బీజేపీకి చెడిపోవడానికి ఏముంది..? మేమేమన్నా టీడీపీ, బీజేపీలా అధికారాన్ని పంచుకున్నామా..? 
మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇక్కడేదో ప్రాబల్యం చూపించుకుందామని రాజకీయ విమర్శలు చేస్తున్నట్లున్నారు. 
బ్యాక్‌ గ్రౌండ్‌లో ఏం మ్యూజిక్‌ నడుస్తుందో ఎవరికి తెలుసు...?
వెంకయ్యనాయుడుగారు ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు..పదేళ్లు కావాలి అని అడగలేదా..? 
అమరావతిని మేమేం తీసేయలేదు కదా...దానితో పాటు విశాఖ కూడా అంటున్నాం. 
దేశంలో 15 రాష్ట్రాలు పోటీ పడితే బల్క్‌ డ్రగ్‌ పార్కు ఎందుకు ఏపీకే ఇచ్చారు..? 
ఇక్కడ అరాచకం కాదు...అవకాశాలు ఉన్నాయి కాబట్టే ఇచ్చారు. 
ప్రస్తుతం ప్రపంచంలో వాడుతున్న కొన్ని మేజర్‌ డ్రగ్స్‌ విశాఖ నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. 
కేవలం ఒక మాట అనేస్తే పరిపోదు కదా..కేంద్రంలో వారే అధికారంలో ఉన్నారు కదా..నిరూపించాలి కదా..
సీఎం రమేష్, సుజనా చౌదరి, రఘురామకృష్ణంరాజు స్క్రిప్ట్‌ ఇస్తే మాట్లాడితే సరిపోదు. 
చంద్రబాబు ఢిల్లీ వెళ్తే మొదటిగా రిసీవ్‌ చేసుకుంది ఈ జోకరే కదా..? 
అలాంటి జోకర్ల మాటలకు మేము సమాధానం చెప్పాలా..? 
 

Back to Top