తిరుపతిలో వైయస్‌ జగన్‌కు ఘన స్వాగతం

తిరుపతి: వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు.ఆయనకు పెద్ద ఎత్తున వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు,అభిమానులు ఘన స్వాగతం పలికారు. రోడ్డు మార్గాన తిరుమలకు బయలుదేరి వెళ్ళారు. రాత్రి తిరుమల పద్మావతి అతిథి గృహంలో  బస చేయనున్నారు. రేపు ఉదయం శ్రీవారిని సందర్శించుకోనున్నారు.వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా తిరుమలలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

అనంతరం రేణిగుంట నుంచి రోడ్డుమార్గంలో వైఎస్‌ జగన్‌ తిరుమలకు బయలుదేరారు. ఆయన రాత్రి తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు. రేపు ఉదయం కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. వైఎస్‌ జగన్‌ శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న తర్వాతే ఏ కార్యక్రమమైనా చేపట్టడం అనవాయితీగా వస్తోంది. ఈ నెల 30న సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ముందుగా శ్రీవారిని దర్శించుకుని రాష్ట్రానికి అన్నివిధాలా మేలు చేయాలని.. ప్రజారంజక, సుపరిపాలన అందించేలా ఆశీర్వదించాలని స్వామిని కోరనున్నారు.

తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం వైఎస్‌ జగన్‌ ప్రత్యేక విమానంలో తిరుపతి నుంచి  వైఎస్సార్ జిల్లా కడపకు చేరనున్నారు. కడపలోని  పెద్ద దర్గాను దర్శించుకుంటారు. ప్రత్యేక ప్రార్థన అనంతరం చాదర్‌ను సమర్పించనున్నారు. కడప దర్గాను సందర్శించిన అనంతరం చాపర్‌ ద్వారా కడప నుంచి పులివెందులకు చేరుకుంటారు. పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడ నుంచి ఇడుపులపాయకు వెళ్లి.. దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధికి నివాళులు అర్పిస్తారు.

తాజా ఫోటోలు

Back to Top