విశాఖలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘన స్వాగతం

విశాఖ‌:  విశాఖపట్నం పర్యటన కోసం న‌గ‌రానికి చేరుకున్న‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఘ‌న స్వాగ‌తం ల‌భించింది.  విశాఖ న‌గ‌రంలోని బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ హాల్‌కు చేరుకొని.. ‘పార్లే ఫర్‌ ది ఓషన్‌’ సంస్థ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ స్టాల్స్, బీచ్‌ పరిరక్షణకు నిర్వహించిన కార్యక్రమాలు, ప్లాస్టిక్‌ నియంత్రణకు సంబంధించి జీవీఎంసీ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం సందర్శిస్తారు. 

పార్లే ఫర్‌ ది ఓషన్‌ సంస్థ గిన్నిస్‌ రికార్డు నెలకొల్పేలా శుక్రవారం బీచ్‌ పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపడుతోంది. జీవీఎంసీ, జిల్లా కలెక్టరేట్, ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారంతో శుక్రవారం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు సాగరతీరాన్ని పరిశుభ్రం చేయనుంది. ఆర్కే బీచ్‌ నుంచి భీమిలి వరకు సుమారు 28 కిలోమీటర్ల పొడవునా సాగరతీరంలో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల్ని సేకరించే కార్యక్రమాన్ని చేపట్టనుంది. మొత్తం 20 వేల మంది వలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 
అనంతరం సీఎం జగన్‌ సమక్షంలో పార్లే సంస్థ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు బీచ్‌ పరిరక్షణపై ఎంవోయూ కుదుర్చుకుంటారు.
సిరిపురంలోని ఏయూ కన్వకేషన్‌ హాల్‌కు చేరుకుని.. మైక్రోసాఫ్ట్‌ సంస్థ అందించిన డిప్లొమా కోర్సును పూర్తి చేసుకున్న 5 వేల మంది విద్యార్థుల్లో కొందరికి సీఎం వైయ‌స్ జగన్‌ సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు. అక్కడి విద్యార్థులను ఉద్దేశించి..  సీఎం వైయ‌స్  జగన్‌ ప్రసంగిస్తారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top