అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

అధికారులు ప్రభుత ప్రాధాన్యాలను గుర్తించి పనిచేయాలి

నవరత్నాలు అందరికీ అందజేయడమే తొలి లక్ష్యం

డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌

ఏలూరుః నవరత్నాలు అందరికీ అందజేయడమే తొలి లక్ష్యమని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. ఏలూరు కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యాలను అధికారులు గుర్తించి పనిచేయాలని సూచించారు. ఎన్నికల ఇచ్చిన హామీలు అమలు చేయడం మనందరిపై ఉందని పిలుపునిచ్చారు. అవినీతి రహిత పరిపాలన అందించడమే సీఎం వైయస్‌ జగన్‌ లక్ష్యమని పేర్కొన్నారు.అన్నివర్గాలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు.

గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ  జిల్లాలోసురక్షిత తాగునీరు ఇవ్వడానికి కార్యాచరణ సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఇంటర్‌ విద్యార్థులందరికీ అమ్మ ఒడి అందిస్తున్నామని తెలిపారు. గోదావరి డెల్టాకు మరో వెయ్యి క్యూసెక్కుల నీరు పెంచాలని కోరారు. రైతులకు మేలు జరగాలన్నదే సీఎం జగన్‌ లక్ష్యమని పేర్కొన్నారు.

మహిళ,శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ «ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి అని పేర్కొన్నారు. నవరత్నాలు అమలు చేయడమే సీఎం జగన్‌ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, ఎంపీలు కోటగిరి శ్రీధర్, కనుమూరి రఘు రామకృష్ణంరాజు పాల్గొన్నారు.

 

తాజా వీడియోలు

Back to Top