చ‌ర్చ‌కు ర‌మ్మంటే టీడీపీ నేత‌లు భ‌య‌ప‌డుతున్నారు

ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాసులు

అమ‌రావ‌తి: చంద్రబాబు అవినీతి పై చర్చించేందుకు రమ్మంటే టీడీపీ నేతలు భయపడుతున్నారని ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాసులు అన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రావాలని సవాల్ చేశారు. చంద్రబాబు తప్పు చేసింది వాస్తవం అవునా ..కాదా ? అంటూ ప్రశ్నించారు. ఎక్కడ దొరికిపోతామోనని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలు ఎందుకు సీబీఐ ఎంక్వైరీ కోరలేకపోతున్నారో ఆలోచించాలన్నారు.  చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేశారో ప్రజలకు తెలిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. టీడీపీ నేతలు స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్ట్ పైనే మాట్లాడుతున్నారు.. దానిపై చర్చిద్దాం అంటే ఎందుకు పారిపోతున్నారో అర్థం కావట్లేదన్నారు. చంద్రబాబు తప్పు చేయలేదని ఎందుకు చెప్పలేకపోతున్నారో తెలియడం లేదన్నారు. సమావేశాల్లోనే కచ్చితంగా చంద్రబాబు అవినీతి పై చర్చింది.. నిజనిజాలను ప్రజల ముందు ఉంచుతామన్నారు.

తాజా వీడియోలు

Back to Top