కమ్యూనిస్టు పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరండి

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి  

 
విజయవాడ: కమ్యూనిస్టు పార్టీలంటే గతంలో గౌరవం ఉండేదని.. నారాయణ, రామకృష్ణ లాంటి వ్యక్తులు వచ్చాకా ఆ పార్టీలపై గౌరవం పోయిందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. సీపీఐ నేత రామకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టులు చదివే బదులు కమ్యూనిస్టు పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం లో చేరండని ధ్వజమెత్తారు. వైయ‌స్ఆర్‌సీపీ మైనార్టీల పక్షపార్టీ, సెక్యులర్‌ పార్టీ అని అందరికీ తెలుసు. అంజాద్‌ బాషా మాటకు కట్టుబడి ఉంటామని సీఎం వైయ‌స్ జగన్‌ బహిరంగ సభ సాక్షిగా ప్రకటించారని పేర్కొన్నారు. రామకృష్ణ లాంటి వారి మాటలు నమ్మొద్దని  మైనార్టీలకు శ్రీకాంత్‌ రెడ్డి సూచించారు.

నారాయణ, రామకృష్ణలకు టీడీపీ నుంచి డబ్బులు అందుతున్నాయని ఆయన ఆరోపించారు. ప్రతిరోజు రామకృష్ణ లోకేష్‌ బండి ఎక్కుతారని.. డబ్బులు తీసుకుంటారని టీడీపీయే ప్రచారం చేస్తోందన్నారు. ‘చంద్రబాబు ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీకి, బీజేపీకి అక్రమ సంబంధం అంటగట్టాలని చూశారు.. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత బీజేపీతో సంబంధాలు నడుపుతున్నది టీడీపీ కాదా..?’ అని శ్రీకాంత్‌ రెడ్డి ప్రశ్నించారు.

తాజా వీడియోలు

Back to Top