అనంతపురం: రాష్ట్రంలో తొమ్మిది నెలలుగా సీఎం వైయస్ జగన్ నాయకత్వంలో అద్బుతమైన పాలన సాగుతోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా.. సంక్షేమం, అభివృద్ధి విషయంలో వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతున్నారన్నారు. తొమ్మిది నెలలుగా సీఎం చేసిన మంచి పనులే పంచాయతీ ఎన్నికల్లో వైయస్‌ఆర్ సీపీ అభ్యర్థులను గెలిపిస్తాయన్నారు. అనంతపురంలో సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. తొమ్మిది నెలలుగా సీఎం వైయస్ జగన్ అద్బుతమైన పాలన అందిస్తున్నారు. స్థానిక సంస్థల ద్వారా మరోసారి ప్రజల ముందుకెళ్తున్నాం. గత తొమ్మిది నెలలుగా ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు, మేనిఫెస్టోలో పెట్టి 90 శాతం పైగా అమలు చేసిన పథకాలు. అంతకు మించి అవసరాన్ని బట్టి చేసుకుంటూ వచ్చిన చర్యలన్నీ ప్రజల ముందుంచి ఆశీస్సులు కోరుతాం. కోర్టు కేసుల వల్ల పంచాయతీ ఎన్నికలు లేటయ్యాయి. కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాన్ని చట్టం చేయాలనుకున్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం, ఇతర ప్రలోభాలకు గురిచేసి ఆధారాలతో పట్టుబడితే ఎన్నిక రద్దు కావడమే కాకుండా మూడేళ్ల పాటు జైలు శిక్ష ఉంటుందని కఠినమైన నిబంధన పెట్టడం, స్థానికంగా అభ్యర్థులు ఉండాలని షరతు పెట్టడం, ప్రచారానికి గడువు తగ్గించడం ఇవన్నీ చూస్తే ఎవరైతే ప్రజల్లో ఉండే నాయకుడే గెలవగలడు. ఇందులో విప్లవాత్మక సంస్కరణ కనిపిస్తోంది. మద్యం లేకుండా ఎన్నికలకు వెళ్లడం అందరికీ సవాల్‌తో కూడుకున్న నిర్ణయమే. ఎవరు, ఏ పార్టీ అనేది చూడకుండా మద్యం, డబ్బు పంచే వారిపై వెంటనే కేస్ బుక్ చేయాలని మంత్రులు, పోలీసులు, కలెక్టర్లను సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. సీఎం వైయస్ జగన్ ముక్కుసూటిగా వెళ్తారు అందువల్ల కష్టాలు నష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడ్డారు. ఆఖరికి ప్రజల పూర్తివిశ్వాసాన్ని చురగొని 50 శాతం ఓట్ల మార్కు కూడా దాటి ఒక శక్తివంతమైన ముఖ్యమంత్రిగా ఎదిగారు. రాష్ట్రం కష్టాల్లో ఉన్నా.. ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే రాష్ట్ర అభివృద్ధికి అడుగులు వేస్తున్నారు. సీఎం వైయస్ జగన్ చేసే పనిలో నిజాయితీ, నిబద్ధత, తపన ఉన్నాయి. అందుకే అతితక్కువ కాలంలోనే గొప్ప సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఏ పథకం మీద ప్రభుత్వంపై బురదజల్లేందుకు వీలులేకపోవడంతో.. ఏదో ఒకటి క్రియేట్ చేసి ప్రతిపక్షం, ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తున్నాయి. తాజాగా ఇప్పుడు తెరమీదకు తీసుకొచ్చింది. బీసీలపై ప్రేమ లేక వైయస్‌ఆర్ సీపీ సుప్రీం కోర్టుకు అప్పీల్‌కు వెళ్లడం లేదని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. బీసీల రిజర్వేషన్‌ను అడ్డుకున్న పార్టీనే.. ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. సంక్షేమ పథకాలే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్‌ఆర్ సీపీని గెలిపిస్తాయని సీఎం వైయస్ జగన్ పరిపూర్ణంగా నమ్ముతున్నారు. కిందిస్థాయిలో కూడా పార్టీని గెలిపించుకోగలిగితే ప్రజలకు వద్దకు పాలన అనే సీఎం ఆలోచన నెరవేరుతోంది.