తొలిపొద్దు పొడుపులో చైతన్య ప్రవాహం ఈ ప్రజాపాలన

పేద కుటుంబాల్లో కమ్ముకున్న చీకట్లను చీల్చిన సూరీడు సీఎం వైయస్‌ జగన్‌

ప్రజా సంకల్పయాత్రతో ఏపీలో నూతన అధ్యాయం మొదలైంది

ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకువచ్చేలా మేనిఫెస్టో తెచ్చాం

ఏడాదిన్న‌ర పాల‌న‌లోనే 90 శాతంపైగా హామీలు అమ‌లు చేశాం

గ్రామ సచివాలయ, వలంటీర్ల వ్యవస్థతో గుమ్మం ముందుకే సంక్షేమం 

సంక్షోభాలు ఎన్నొస్తున్నా.. రాష్ట్రాన్ని ముందుకునడిపిస్తున్న ధీశాలి 

నూతన వ్యవస్థలకు శ్రీకారం చుట్టిన దార్శనికుడు సీఎం వైయస్‌ జగన్‌

నవంబర్‌ 6 నుంచి మా పార్టీ తరఫున కార్యక్రమాలు చేపట్టనున్నాం

వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: దేశ చరిత్రలో తొలిసారిగా ఈ మూడేళ్లలో దాదాపు అన్ని రకాలుగా ఒక రకమైన రికార్డు సృష్టించుకుంటూ తనకు తానే ఒక డ్రైవింగ్‌ ఫోర్స్‌గా, మార్పునకు నాంధిగా, నూతన వ్యవస్థలకు శ్రీకారం చుట్టిన దార్శనికుడిగా సీఎం వైయస్‌ జగన్‌ అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ రోజు దేశంలోనే అరుదైన రాజనీతిజ్ఞుడిగా, నిజమైన ప్రజా నాయకుడిగా వైయస్‌ జగన్‌ నిలబడ్డారని చెప్పడానికి ఆయనతో పాటు నడిచే కార్యకర్తగా కాకుండా సామాన్యమైన వ్యక్తిగా గర్వంగా చెప్పగలను అన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. 

‘దివంగత మహానేత వైయస్‌ఆర్‌ కుటుంబాన్ని ప్రేమించే లక్షలాది కుటుంబాలకు కాకుండా.. రాష్ట్రమంతా మూడేళ్లలో ఏం జరిగింది. ఒక మాఫియా ముఠాలాంటి పాలన నుంచి.. చీకటి తరువాత తొలి పొద్దు పొడిచినట్లుగా రావడంతో పాటు.. ఒక స్తబ్ధత నుంచి ఒక చైతన్యంలోకి రాష్ట్రం ఎలా ముందడుగు వేసిందో కనిపింది. ప్రజలంతా ఒకసారి గుర్తుచేసుకోవాలి. అందువల్ల నవంబర్‌ 6 నుంచి వైయస్‌ఆర్‌ సీపీ తరుఫున కార్యక్రమాలు చేపట్టాలని ఆలోచన. దానిగురించి కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. 

ఇందులో విశేషం ఏముందని ఒకసారి మూడేళ్లు వెనక్కు తిరిగి గమనిస్తే.. 14 నెలల పాటు వైయస్‌ జగన్‌ ప్రజల్లోనే ఉన్నారు. 2017 నవంబర్‌ 6న ఇడుపులపాయ నుంచి మొదలుపెట్టిన పాదయాత్ర.. 14 నెలల పాటు పూర్తిగా 3,648 కిలోమీటర్లకు పైగా సాగి ఇచ్ఛాపురంలో ముగిసింది. 

జనంలో తాను ఒకడిగా, రాత్రయితే గుడారంలో విశ్రాంతి తీసుకొని.. పొద్దునే మళ్లీ పాదయాత్రగా బయల్దేరడం.. అక్కడి నుంచే పార్టీని నడపడం, ప్రణాళికలు, అభ్యర్థుల ఎంపిక చేయడం. చరిత్రలో మొదటిసారి ఒకే జాబితాలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ మొత్తం అభ్యర్థులను వైయస్‌ జగన్‌ ప్రకటించారు. సమర్థవంతంగా అన్నీ పూర్తిచేసి తరువాత ఎన్నికల ప్రచారంలోకి వచ్చారు. 14 నెలలు పాదయాత్ర, మూడు, నాలుగు నెలలు ఎన్నికల ప్రకారం, ప్రమాణస్వీకారం చేసిన మే 30 నుంచి చూసుకుంటే.. 14 నెలల రూల్‌ చేశారు. ఈ రెండింటి మధ్య సరిగ్గా సమయం చూసుకుంటే.. 14 నెలలు జనంలో, మళ్లీ 14 నెలల పాటు జనం కోసం ప్రభుత్వాన్ని పూర్తిగా అంకితం చేసి నడుపుతూ వచ్చారు. 

పాదయాత్రలో ప్రజల కష్టాలను, ఇబ్బందులను ప్రత్యక్షంగా గమనించి.. అంతకు ముందు ఓదార్పుయాత్రలో తనకు వచ్చిన అనుభవాలను జోడించి ఒక బ్లూ ప్రింట్‌ తయారు చేశారు. మేనిఫెస్టోను 4 పేజీల్లో తీసుకువచ్చి రికార్డు సృష్టించారు. మేనిఫెస్టోలోని ప్రతీ అంశం ప్రజల జీవితాల్లో పూర్తిగా మార్పు తీసుకువచ్చే దిశగా నడిపించేదని అన్ని తరగతి ప్రజలను అడ్రస్‌ చేస్తూ తయారు చేసిన మేనిఫెస్టోను తొలి ఏడాదిన్నర పాలనలోనే 90 శాతం పైగా పూర్తి చేసి రికార్డు సృష్టించారు. 

14 నెలలు ఊహించని మార్పులు జరుగుతూ వచ్చాయి. సంక్షోభాలు వస్తున్నా వాటిని తట్టుకొని రాష్ట్రాన్ని ముందుకు నడపడంలో ధీశాలిగా సీఎం వైయస్‌ జగన్‌ చేస్తున్న ప్రయత్నాలు. తన సహచరులను, మంత్రులను కలుపుకొని ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలిస్తూ చేసి మంచి పనులు ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. 

ప్రజా జీవనంలో భాగంగా.. నూతన వ్యవస్థల సృష్టించడం గర్వంగా చెప్పుకోదగ్గ అంశం. వికేంద్రీకరణను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లి గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ తీసుకువచ్చి 4 లక్షలకు పైగా నిరుద్యోగుకు ఉద్యోగాలు ఇవ్వడం.. అందులో 80 శాతానికిపైగా బడుగు, బలహీనవర్గాలు ఉన్నారు. ప్రజల వద్దకే ప్రభుత్వ పథకాలను చేర్చారు. పదేళ్ల కాలంలో ఒక కుటుంబ సంతోషానికి, సమాజ అభ్యుదయానికి, పిల్లల భవిష్యత్తు కోసం చేపట్టిన చర్యలు చాలా తక్కువగా కనిపిస్తాయి. కానీ, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఏడాదిన్నర పాలనలో మెండుగా కనిపిస్తుంది. 

ఇంతకు ముందు ఒక రేషన్‌ కార్డు కోసం ఉద్యమాలు, ఇంటి పట్టా, కుల సర్టిఫికెట్‌ కావాలంటే ఆందోళనలు, పైరవీలు చేయాల్సిన పరిస్థితులు గతంలో ఉండేవి. కానీ, సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో రేషన్‌ దగ్గర నుంచి ఏదైనా అర్హత ఉంటే చాలు పారదర్శకంగా ప్రతీది అందిస్తున్నాం. 6 లక్షల మందికి కొత్తగా బియ్యం కార్డు జారీ చేసినట్లుగా నిన్ననే చూశాం. ప్రతీ పథకం నుంచి అందే సాయం డైరెక్ట్‌ లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. ఇవన్నీ సీఎం వైయస్‌ జగన్‌ తపన, సంకల్పం వల్లే సాధ్యమైంది. రివర్స్‌టెండరింగ్‌ ద్వారా వేల కోట్ల రూపాయలు ఆదా చేస్తున్నాం’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top