కుల‌, మ‌త‌, ప్రాంతాలు, పార్టీల‌కు అతీతంగా సంక్షేమ ప‌థ‌కాలు

గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో గొర్లె కిర‌ణ్‌కుమార్‌

ఎచ్చెర్ల‌: కుల‌, మ‌త‌, ప్రాంతాలు, పార్టీల‌కు అతీతంగా సంక్షేమ ప‌థ‌కాలు అందిస్తున్నామ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ అన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం రావాడ గ్రామ సచివాలయం పరిధిలోని లంకపేట గ్రామంలో గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్ర‌తి ఇంటికి వెళ్లి ఈ మూడున్న‌రేళ్ల‌లో ప్ర‌భుత్వం నుంచి పొందిన ల‌బ్ధిని వివ‌రిస్తూ సంక్షేమ ప్ర‌భుత్వాన్ని ఆశీర్వ‌దించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. స్థానికుల స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకుని ప‌రిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..  గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాకు ఓటు వేయని వారికి కూడా అన్ని సంక్షేమ పధకాలు అందిస్తున్నామని చెప్పారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో మాత్ర‌మే రాజ‌కీయాలు చేయాల‌ని, మాకు ఓట్లు వేయ‌క‌పోయినా అర్హ‌తే ప్రామాణికంగా సంక్షేమ ప‌థ‌కాలు అందిస్తున్నామ‌ని చెప్పారు.  కార్యక్రమంలో రణస్థలం మండలం వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహంతి పెద్దరామునాయుడు, బూత్ కమిటీ కన్వీనర్ చిల్ల వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ ప్రతినిధి మైలపల్లి కామరాజు, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పిల్ల ఆనంద్ పాత్రుడు, టెలికాం డైరెక్టర్ బడి రాంబాబు, సర్పంచుల సంఘం అధ్యక్షులు రెడ్డి విశ్వేశరావు, నాయకులు గొర్లె అప్పలనర్సు నాయుడు, రావాడ నాయకులు గొర్లె శ్రీనువాసరావు, ఎంపీటీసీ కిల్లారి తవిటమ్మ, కిల్లారి సూర్యనారాయణ, నాయకులు కిల్లారి సన్యాసినాయుడు, కిల్లారి రమణ, కిల్లారి అప్పలనాయుడు, లంక అసిరినాయుడు, బొంతు సూర్యనారాయణ, లంక పాపారావు, లంక రాము, లంక రమణ, బోర సత్యం, బొంతు లక్ష్మణ,  తదితరులు పాల్గున్నారు.

Back to Top