ఏపీకి మంచిరోజులు వచ్చాయి..

వైయస్‌ జగన్‌పై నమ్మకంతోనే అఖండ విజయం

వైయస్‌ఆర్‌సీపీ నేత అంబటి రాంబాబు

అమరావతి: వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రజలందరూ పూర్తి విశ్వాసంతో అఖండ విజయం అందించారని వైయస్‌ఆర్‌సీపీ నేత అంబటి రాంబాబు అన్నారు.కనీవినీ ఎరుగని రీతిలో 151 అసెంబ్లీ స్థానాలను వైయస్‌ఆర్‌సీపీ సాధించిందని తెలిపారు.వైయస్‌ జగన్‌పై ప్రజలందరూ చాలా ఆశలు పెట్టుకున్నారన్నారు.చంద్రబాబు పాలనలో రాష్ట్రాన్ని చిందరవందర చేశారని,ప్రజలను భయపెట్టే విధంగా పాలన సాగిందన్నారు.రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ముందుకు తీసుకెళ్ళాల్సిన కష్టతరమైన  బాధ్యత వైయస్‌ జగన్,వైయస్‌ఆర్‌సీపీపై ఉందన్నారు.ప్రజలకు మంచి పరిపాలన అందిస్తారని తెలిపారు.
వైయస్‌ జగన్‌ సారధ్యంలో మళ్లీ రాజన్న రాజ్యం:కోలగట్ల
ఎమ్మెల్యే అభ్యర్థులను వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతినిధులుగా భావించి ప్రజలందరూ ఓట్లు వేసి గెలిపించారని  వైయస్‌ఆర్‌సీపీ నేత కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు.మళ్లీ వైయస్‌ఆర్‌ పాలన  రావాలని కోరుకుంటున్నామని తెలిపారు.

 

Back to Top