లిక్క‌ర్ అక్ర‌మ కేసులో న్యాయమే గెలిచింది 

మాజీ డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామి

మిథున్ రెడ్డి విడుద‌ల‌పై జీడీ నెల్లూరు వైయ‌స్ఆర్‌సీపీ నేతల సంబరాలు  

గంగాధర నెల్లూరు:  లిక్క‌ర్ అక్ర‌మ కేసులో న్యాయ‌మే గెలిచింద‌ని మాజీ డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామి పేర్కొన్నారు. రాజంపేట పార్లమెంటు సభ్యుడు, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు బెయిల్  మంజూరు చేయడంపై  నారాయణస్వామి ఆధ్వర్యంలో జీడి నెల్లూరు మండల వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సంబ‌రాలు చేసుకున్నారు. ట‌పాకాయ‌లు పేల్చి, స్వీట్లు పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా నారాయ‌ణ‌స్వామి మాట్లాడుతూ..  మిధున్ రెడ్డి పై కూటమి ప్రభుత్వం అక్రమ లిక్కర్ కేసు అంటగట్టి జైలు పాలు చేసింద‌ని మండిప‌డ్డారు.  చివ‌ర‌కు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేయడం సంతోషంగా ఉంద‌న్నారు.  కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు ముని రాజారెడ్డి, మాజీ కార్పొరేషణ్ డైరెక్టర్ గుణశేఖర్ రెడ్డి, వైస్ ఎంపీపీ హరిబాబు, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు ఏకాంబరం, మాజీ మార్కెటింగ్ డైరెక్టర్ వేలు మొదలియార్, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు కిషోర్ రెడ్డి, నియోజకవర్గ ఆర్టిఐ విభాగం అధ్యక్షుడు ఢిల్లీ కుమార్, మోహన్, వినోద్, శ్రీ రంగరాజపురం మండల నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

పెనుగొండ బాబయ్య దర్గాలో ప్ర‌త్యేక పూజ‌లు  
 లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎంపీ మిథున్‌రెడ్డికి బెయిల్ మంజూరు కావ‌డం ప‌ట్ల శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా పెనుగొండ బాబ‌య్య ద‌ర్గాలో వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ కావాల‌ని మొక్కుకున్నామ‌ని, అన్ని అడ్డంకులు తొల‌గి బెయిల్‌పై విడుద‌ల కావ‌డంతో మొక్కులు తీర్చుకున్న‌ట్లు చెప్పారు. 

Back to Top