సీఎం వైయ‌స్‌ జగన్‌ను కలిసిన గౌతమ్‌ అదానీ  

తాడేప‌ల్లి: అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ తాడేపల్లిలోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డితో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. గంగవరం పోర్టుకు సంబంధించి వివిధ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై సీఎం వైయ‌స్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. వీరి మధ్య రాష్ట్రంలో అదానీ కంపెనీ పెట్టుబడులకు సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఈ మేరకు సీఎం వైయ‌స్ జగన్‌తో జరిగిన చర్చల సారాంశంపై అదానీ తన ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు.

Back to Top