డిసెంబర్‌లోగా పూర్తిస్థాయిలో నీరిస్తాం

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి 
 

అనంతపురం : కదిరి ప్రాంతానికి హంద్రీనీవా ద్వారా పూర్తిస్థాయిలో డిసెంబర్‌లోగా నీరిస్తామని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి 
అన్నారు. రాయచోటికి సంక్రాంతికి హంద్రీనీవా నీటిని అందిస్తామని తెలిపారు. జలయజ్ఞాన్ని ప్రారంభించి హంద్రీనీవా ప్రాజెక్టును చేపట్టిన మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డిని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  అవినీతి జరిగిన ప్రాజెక్టులలో రివర్స్ టెండర్ల ద్వారా పనులు చేపడతామని చెప్పారు. రివర్స్ టెండర్ల ద్వారా రెండు పనుల్లోనే రూ. 750 కోట్ల ప్రజాధనాన్ని మిగిల్చామన్నారు. నామినేషన్ పనుల ద్వారా చంద్రబాబు బంధువు కంపెనీ నవయుగకు పనులు కట్టబెట్ట లేదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల సొమ్ముకు కాపలాదారులుగా ఉంటారన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top