ఎర్రగుడిలో అట్టహాసంగా 'గడపగడపకు మన ప్రభుత్వం'

 మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డికి ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు

ఉరవకొండ: బెలుగుప్ప మండలం ఎర్రగుడి గ్రామంలో బుధవారం 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా వైయ‌స్ఆర్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి హాజరయ్యారు. ముందుగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పూల వర్షం కురిపించారు.అనంతరం ఆయన ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం పథకాలు వివరించారు.  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందు కృషి చేస్తామని విశ్వేశ్వ‌ర‌రెడ్డి తెలిపారు. అదే విదంగా ప్రభుత్వ పథకాలు అర్హులకు సక్రమంగా అందుతున్నాయ లేదా అని తెలుసుకుంటున్నామని చెప్పారు. ప్రజలు తెలిపిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులకు సూచించారు. కార్యక్రమంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,ప్రజా ప్రతినిధులు, అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Back to Top