సంక్షేమం.. అభివృద్దే లక్ష్యంగా వైయ‌స్ జగన్ పాలన

  వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి

ఉరవకొండ:  ప్రజల సంక్షేమం.. అభివృద్దే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం సుపరిపాలన అందిస్తూ పక్క రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని ఉరవకొండ నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్చార్జ్, మాజీ వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు.  మండల పరిధి వ్యాసాపురం గ్రామంలో "గడప గడపకూ మన ప్రభుత్వం" కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఎంపిపి చంద్రమ్మ, జెడ్పిటిసి పార్వతమ్మ, వైస్ ఎంపీపీ నరసింహులు,మార్కెట్ కమిటీ చైర్మన్ సుశీలమ్మ, జిల్లా అధికార ప్రతినిధి వీరన్న, కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ గోవిందు, ఆమిద్యాల పీఏసీఎస్ చైర్మన్ తేజోనాత్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుంకన్న, ఎంపిటిసి నీలావతి, నాయకులు ఉలిగప్ప, మల్లికార్జున గౌడ్,ఎంపీడీఓ దామోదర్ రెడ్డి, తహశీల్దార్ మునివేలు, సచివాలయ సిబ్బంది హాజరయ్యారు.ముందుగా గ్రామంలోని మారెమ్మ-దేవమ్మ ఆలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ప్రజలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలను వివరించారు.అనంతరం విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కుల మత ప్రాంత, పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలలో అర్హతే ప్రామాణికంగా తీసుకుని అందరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. పేద ప్రజలందరికీ పక్కా ఇళ్లను నిర్మించేందుకు జగనన్న కాలనీలు, రైతుల అభ్యున్నతి కోసం వైఎస్సార్ భరోసా, పేద ప్రజల ఆరోగ్యం కోసం ఆరోగ్య శ్రీ వంటి పథకాలు అందిస్తున్నామన్నారు. పేద విద్యార్థులు ఆర్ధిక ఇబ్బందులతో చదువు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం, అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతి విద్యార్థి తల్లుల ఖాతాలలో ఏడాదికి రూ.15 వేలు జమ చేస్తున్నామన్నారు.నవరత్న పథకాల ద్వారా ప్రజల ఆర్థిక పురోభివృద్ధిని కాంక్షిస్తున్న ఏకైన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమని పేర్కొన్నారు. జగనన్న పరిపాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమిద్యాల రాజేష్, రాయంపల్లి నాయకు ప్రభాకర్ రెడ్డి, ఎర్రిస్వామి రెడ్డి,చంద్రహాస్ రెడ్డి, వ్యాసాపురం నాయకులు సన్నప్పయ్య, బసవరాజు స్వామి, వెంకటేసులు, వన్నూర్ స్వామి, మారాజు, రామప్ప, ఎంఎల్ఓ ఓబులేసు,అయ్యర్ దాదు, వలంటీర్లు,కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Back to Top