శ్రీ‌శైలంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం

ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డికి ఘ‌న స్వాగ‌తం

నంద్యాల‌:  ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్ర‌మైన శ్రీ‌శైలంలో ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యేకు స్థానికులు గ‌జ మాల‌తో స‌త్క‌రించి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. శ్రీశైలంలోని కొత్తపేటలో మహిషాసుర మర్దిని ఆలయం వద్ద నుంచి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభమైంది. ముందుగా మహిషాసుర మర్దిని ఆలయం వద్ద ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రతి ఇంటికీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి వెళ్ల‌గా మహిళలు పూలమాలలతో, హారతులతో ఘన స్వాగతం పలికారు. కొత్తపేటలోని 10వ వార్డులో ఎమ్మెల్యే  ఇంటింటికి వెళ్తు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి లబ్ధిదారులకు వివరిస్తున్నారు. ప్ర‌తి గ‌డ‌ప‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేస్తున్న మంచిని వివ‌రిస్తూ..ముఖ్య‌మంత్రికి మీ ఆశీస్సులు అందించాల‌ని కోరారు.  ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతీ పథకం అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నామన్నారు.   

తాజా వీడియోలు

Back to Top