`గ‌డ‌ప గ‌డ‌ప‌కు` దీవెన‌లు

పార్వ‌తీపురం:  గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మానికి ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌న ల‌భిస్తోంది. పార్వతీపురం నియోజకవర్గం బలిజిపేట మండ‌లం నూకలవాడ సచివాలయం పరిధిలో గురువారం ఉద‌యం వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారధ్యంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వ‌హించారు. ఎమ్మెల్యేతో పాటు అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, వాలంటీర్లు ఇంటింటా ప‌ర్య‌టించి ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుపై ఆరా తీసి, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. ప్ర‌తి ఇంటి వ‌ద్ద వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల‌ను ప్ర‌జ‌లు ఆశీర్వ‌దిస్తూ..దీవిస్తున్నారు.  గ్రామ సర్పంచ్ కురిటి వెంకట్రావు  ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున గ్రామ ప్రజానీకం సాదర స్వాగతం పలికి  ఎమ్మెల్యే వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే  ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారిని కలుసుకోవడంతో పాటు తమ జగనన్న ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వారికి వివరించి, వారు పొందుతున్న లబ్ధి సమాచారంతో కూడిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సంతకం చేసిన ఉత్తరాన్ని, బుక్ లెట్‌ను అంద‌జేశారు.   

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top