సీఎం వైయ‌స్‌ జగన్‌ను కలిసిన ఫాక్స్‌కన్‌ ఎండీ

కంపెనీ విస్తరణ, పెట్టుబడులపై చర్చ 

తాడేప‌ల్లి: సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రైజింగ్‌ స్టార్స్‌ మొబైల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఫాక్సకన్‌ టెక్నాలజీ గ్రూప్‌ కంపెనీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ జోష్‌ పాల్గర్, కంపెనీ ప్రతినిధి లారెన్స్‌ కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం ఈ భేటీ జరిగింది. రాష్ట్రంలో ఫాక్సకన్‌ కంపెనీ విస్తరణ, పెట్టుబడులపై సీఎం వైఎస్‌ జగన్‌తో పాల్గర్‌ చర్చించారు. ఫాక్స్‌కన్‌ పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు.
కోవిడ్‌ కష్టకాలంలోనూ నెల్లూరు జిల్లా తడ, శ్రీ సిటీలో తమ ప్లాంటు నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం మంచి సహకారం అందించిందని సీఎంకు పాల్గర్‌ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, వైయ‌స్సార్‌ ఈఎంసీ సీఈవో నందకిషోర్‌ పాల్గొన్నారు.

Back to Top