సాంకేతిక విద్యతోనే ఉజ్వల భవిత

విద్యార్థులకు ట్యాబ్‌ల‌ పంపిణీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి

ఉరవకొండ: సాంకేతిక విద్య ద్వారా విద్యార్థులకు ఉజ్వల భవిత చేకూరుతుందని ఉరవకొండ వైయ‌స్ఆర్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. బుధవారం కూడేరు, విడపనకల్లు మండలం గడేకల్లు జెడ్పి ఉన్నత పాఠశాలల్లో జరిగిన ట్యాబ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రెండు మండలాల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం మంజూరు చేసిన ట్యాబ్‌ల‌ను విశ్వేశ్వరరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా విశ్వేశ్వ‌రెడ్డి మాట్లాడుతూ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక విద్యారంగానికి పెద్దపీట వేశారన్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం వివిధ పథకాలను అమలు చేస్తోందని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పేదల పిల్లలు ఉన్నత చదువులు చదివి బాగుపడాలని ప్రభుత్వం విద్యాభివృద్ధికి రూ.కోట్లు వెచ్చిస్తోందని చెప్పారు.నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయన్నారు. కార్పొరేటు దీటుగా అధునాతన సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థులు ఉన్నతవిద్యలో సాంకేతికను అభ్యసించి, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.  కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దేవా, ఎంపిటిసిలు వెంకటలక్ష్మి, ఇప్పేర్ రమేష్, మండల కన్వీనర్ రాజశేఖర్, స్కూలు కమిటీ చైర్మన్ ఓబులుపతి,సర్పంచ్ లు ఓబులమ్మ, చంద్రశేఖర్, ధనుంజయ, ఓబులేసు,నాగమ్మ, నాయకులు బైరెడ్డి రామచంద్రారెడ్డి, తుప్పటి హరీష్, తిమ్మారెడ్డి, కిష్టప్ప, రమేష్ నాయక్, శంకర్ నాయక్,శ్రీకాంత్ వేణు, సిద్దారెడ్డి, ఎర్రనాగప్ప,వడ్డే గంగాధర్,  తదితరులు, విడపనకల్లు మండల కన్వీనర్ బసన్న,సర్పంచ్ సుశీల, ఎంపిటిసి ఓబులేసు,ఉప సర్పంచ్ పార్వతి, కో అప్షన్ లతీఫ్, నాయకులు కరణం భీమరెడ్డి, సింగాడి తిప్పయ్య, డోనేకల్లు రమేష్, దేవరాజు,చిన్న వెంకటేష్, స్కూలు విద్యా కమిటీచైర్మన్, రాముడు, హెచ్ఎం నారాయణరెడ్డి, ఎంఇఓ ప్రభావతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Back to Top