ప్ర‌జా సంక్షేమ‌మే ధ్యేయంగా.. ప్ర‌తీ హామీ అమ‌లు..

ఎంఎం హళ్లిలో `గడప గడపకు మన ప్రభుత్వం`లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర్‌రెడ్డి

ఉరవకొండ: ప‌్ర‌జా సంక్షేమ‌మే ధ్యేయంగా, ఎన్నిక‌ల ముందు ఇచ్చిన ప్ర‌తీ హామీని ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అమ‌లు చేస్తున్నార‌ని ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్ఆర్ సీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వ‌ర్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గ ప‌రిధిలోని కూడేరు మండలం ఎంఎం హళ్లి గ్రామంలో `గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్య‌క్ర‌మానికి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర్‌రెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా గ్రామంలోని గడపకు వెళ్లి సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అందిస్తున్న పథకాలను ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. లబ్ధిదారులతో కలిసి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సంద‌ర్భంగా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో చెప్పిన‌వే కాకుండా.. చెప్ప‌ని హామీల‌ను కూడా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నెర‌వేరుస్తున్నార‌ని చెప్పారు. కుల‌, మ‌త‌, ప్రాంత‌, వ‌ర్గ‌, చివ‌ర‌కు పార్టీలకు అతీతంగా ప్రతీ పథకం అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నార‌ని వివ‌రించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top