తాడేపల్లి: నారా లోకేశ్ యాత్రకు బహుబలి అంత బిల్డప్ ఇచ్చినా అందరూ జోకర్‌లాగే చూస్తున్నారని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ ఎద్దేవా చేశారు. ఆయన పాదయాత్రకు వాళ్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు రాకపోతే పక్క జిల్లాలు, నియోజకవర్గాల నుంచి రప్పించుకున్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వారు ఆదివారం మీడియాతో మాట్లాడారు. వెలంపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి: విజయవాడకు ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు: - చంద్రబాబు తన సొంత కుమారుడితో పాదయాత్ర చేయించి పార్టీని బలోపేతం చేయాలనుకున్నాడు. - కానీ ప్రజల్లో పెద్దగా స్పందన రాకపోవడంతో దత్తపుత్రుడిని దించాడు. - దత్తపుత్రుడు కూడా ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప మేము, మా చంద్రబాబు ఇది చేశాం అని చెప్పుకునే పరిస్థితి లేదు. - రోజురోజుకీ ప్రభుత్వంపై, జగన్ గారిపై బురద జల్లడంతో క్రెడిబిలిటీ లేకుండా పోయింది. - ఒక మీటింగులో నాకు ముఖ్యమంత్రి అర్హత లేదంటాడు...ఒక మీటింగులో సీఎం పదవి ఇస్తే తీసుకుంటాను అని నిలకడ లేని మాటలు మాట్లాడుతున్నాడు. - మరో మీటింగులో చంద్రబాబు పరిపాలన బాగుంది అంటాడు. - ఇక వీళ్లతో లాభం లేదని చంద్రబాబే రంగంలోకి దిగి..40 ఏళ్ల ఇండస్ట్రీ కూడా యాత్రలు చేస్తున్నాడు. - నేను ముగ్గుర్నీ ఒకటే ప్రశ్నిస్తున్నా..వీరు ముగ్గురు విజయవాడ, గుంటూరులకు ఏం చేశారో చెప్పే ధైర్యం ఉందా..? - ముగ్గురూ కలిసి విజయవాడ, గుంటూరులకు ద్రోహం చేసిన వ్యక్తులు. - ముగ్గురు పుష్కరాల పేరుతో 45 దేవాలయాలను కూల్చేసిన హిందూ ద్రోహులు. - వాటితో పాటు మహాత్మ గాంధీ, పొట్టిశ్రీరాముల విగ్రహాలను ధ్వంసం చేసిన ద్రోహులు. - రాష్ట్రంలో చంద్రబాబు, పవన్, లోకేశ్ ముగ్గురూ హిందూ ద్రోహులు. - వీళ్లకున్న పచ్చ మీడియా ద్వారా ప్రభుత్వంపై బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. - వీళ్లు బురదజల్లే ఉద్యమం చేస్తున్నారు తప్ప ప్రజల్ని మాత్రం మార్చలేకపోతున్నారు. - జగన్‌గారు కులమతాలకు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. - ఆ సంక్షేమ పథకాలు తీసుకున్న వారిలో టీడీపీ నేతలు వర్ల రామయ్య, బుద్దా వెంకన్నలు కూడా ఉన్నారు. - ఇవన్నీ చూసి టీడీపీ, జనసేన క్యాడర్ కూడా జగన్ గారిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని భావిస్తున్నారు. 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామనే దమ్ముందా..?: - కానీ వీళ్ల ముగ్గురు మాత్రం పగటి కలలు కంటున్నారు. - లోకేశ్ పాదయాత్రపై చంద్రబాబుకు నమ్మకం ఉంటే 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని చెప్పే ధైర్యం ఉందా..? - దత్తపుత్రుడు కూడా వారాహి యాత్ర చేస్తున్నాడు కదా..అతను 175 నియోజకవర్గాల్లో పోటీ చేయగలడా..? - వీళ్ల ముగ్గురూ సన్నాసులు కాబట్టి ముగ్గురూ కలిసి జగన్‌గారిని ఎదర్కోవాలని చూస్తున్నారు. - వీరికి జగన్ గారిని ఎదుర్కొనే సత్తా లేక ముగ్గురూ ఒకరికి ఒకరు తోడు కావాలంటున్నారు. - విజయవాడ నగరంలో నారా లోకేశ్ చేసే పాదయాత్ర ఈవినింగ్ వాక్. - కేవలం నా నియోజకవర్గంలో 20 నిమిషాల్లో పాదయాత్ర అయిపోయింది. అది పాదయాత్ర అట. - నియోజకవర్గానికి వచ్చినప్పుడు విజయవాడకు ఏం చేశారో చెప్పుకునే ధైర్యం చేయలేకపోయాడు. - ఇక్కడి సమస్యలేంటనేది కూడా తెలుసుకునే ధైర్యం లేకుండా పోయింది. - లోకేశ్ పాదయాత్రను వాళ్ల పార్టీ ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నానిలే బహిష్కరించారు. - వాళ్ల పార్టీ నాయకులు చాలా మంది లోకేశ్‌పాదయాత్రలో పాల్గొనలేదు. - వేరే నియోజకవర్గాల నుంచి పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి యాత్ర చేసుకుని వెళ్లాడు. చంద్రబాబు టాక్స్, లోకేశ్ టాక్స్‌లు ఇప్పుడు లేవు: - చంద్రబాబు దిగిపోయే సమయంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఛైర్మన్ సీట్లో కూర్చోక ముందే ఎన్నికలు వచ్చేశాయి. - ఇప్పుడొచ్చి ఆర్యవైశ్యులకు ఏదో చేస్తామని కళ్లబొల్లి మాటలు చెప్తున్నారు. - ఆర్యవైశ్యులకు కూడా పథకాలు ఇచ్చిన ఘనత జగన్ గారిది. విదేశీ విద్య ద్వారా మా పిల్లల్ని విదేశాలు పంపించిన ఘనత మా జగన్ గారిది. - గతంలో సీ–ట్యాక్స్, నరసరావుపేటలో కే–టాక్స్, నారా లోకేశ్ టాక్సులు చాలా ఉండేవి. - ఇప్పుడు అర్యవైశ్యుల వ్యాపారాల జోలికి వెళ్లిన దాఖలాలు లేవు. - జగన్‌గారు వచ్చాక ఎంతో మంది ఆర్యవైశ్యులకు ప్రాధాన్యం ఇస్తూ ఎన్నో పదవులు ఇచ్చారు. - నవంబర్ 1న ఏపీ అవతరణ దినోత్సవాన్ని జూన్2 కి మార్చింది ఎవరో లోకేశ్ సమాధానం చెప్పాలి. - పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో వచ్చిన రాష్ట్ర అవతరణను మార్చింది చంద్రబాబు కాదా..? - దాన్ని మళ్లీ మార్చి నవంబర్1న ఏపీ అవతరణ దినోత్సవం జరుపుతున్నది జగన్ గారే. - ఆర్యవైశ్యులను ఇబ్బంది పెట్టిన మీరు వైశ్యుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. - ఎన్నికలు వస్తున్నాయని మీరు ఆర్యవైశ్యులపై కపట ప్రేమ చూపిస్తే నమ్మేవారు ఎవరూ లేరు. సినిమాల్లో, రాజకీయాల్లో పవన్ కల్యాణ్ జీరో: - లోకేశ్, పవన్ కల్యాణ్..మీరు మా జగన్‌గారి గురించి ఏక వచనంతో పిలిస్తే మర్యాద కాదు. - సినిమాల్లో హీరో అని గతంలో అనుకునేవారు...ఈ మధ్య సినిమాల్లో కూడా పవన్ జీరో అయిపోయారు. రాజకీయాల్లో ఆయన ఎలాగూ జీరోనే. - వైయస్ జగన్ గారిని ఏకవచనంతో పిలిస్తే మాత్రం ఊరుకునేది లేదు. - ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచే సత్తా ఒక్క జగన్ గారికే ఉంది. - మీకు ఆ సత్తా ఉంటే చెప్పండి...పెయిడ్‌వర్కర్స్‌తో ఈవినింగ్ వాక్ చేసే వారు కూడా మాట్లాడితే ఎలా..? - చంద్రబాబు, పవన్, లోకేశ్‌లకు సత్తా ఉంటే 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని చెప్పండి. - లోకేశ్‌ను ప్రజలు ఒక జోకర్‌లా భావిస్తున్నారు తప్ప నాయకుడిగా కాదు. - లోకేశ్ పాదయాత్ర, పవన్ చేసే వారాహి యాత్ర, చంద్రబాబు చేసే వృద్ధ యాత్రను రాష్ట్ర ప్రజలు పట్టించుకోవడం లేదు. - గతంలో జగన్ గారు ప్రకాశం బ్యారేజీపై పాదయాత్ర చేయాలంటే అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్నారు. - నల్లబెలూన్లతో నిరసన, పసుపు నీళ్లతో కడగడానికి దిగజారిపోయి ప్రయత్నాలు చేశారు. - మేం ఎక్కడన్నా అడ్డుకోడానికి ప్రయత్నం చేశామా..? లోకేశ్ పాదయాత్రకు ప్రకాశం బ్యారేజీపై అనుమతి ఇచ్చాం. మల్లాది విష్ణు, ఎమ్మెల్యే విజయవాడ సెంట్రల్: ప్రకాశం బ్యారేజీపై లోకేశ్ ఫోటో షూట్‌కు రూ.5 కోట్లు: - బ్యారేజీ మీద ఫోటో కోసం రూ.5 కోట్లు ఖర్చు పెట్టి కిరాయి జనాన్ని తెచ్చుకున్నారు. - బెజవాడ నుంచి వెళ్లేప్పుడు తమ ప్రభుత్వం చేసిన పనులు ఏంటో చెప్పుకోలేని దుస్థితిలో లోకేశ్ ఉన్నాడు. - అంత ధైర్యం వారికి లేదు..విజయవాడకు వారు తమ ఐదేళ్లలో చేసింది ద్రోహమే. - విజయవాడ నగరాన్ని జన్మభూమి కమిటీల పేరుతో పూర్తిగా అవినీతి నెలవాలంగా మార్చారు. - విజయవాడ నగరానికి కేంద్రం రూ.500 కోట్లు ఇస్తే ఆ నిధులనూ దారిమళ్లించిన ప్రభుత్వం టీడీపీదే. - దొంగ టీడీఆర్ బాండ్లను తయారు చేసిన అమ్మిన పార్టీ టీడీపీ. - విజయవాడ నగరంలో దేవాలయాలను నిర్ధాక్షిణ్యంగా కూల్చేసిన పార్టీ టీడీపీ. - అమ్మవారి దేవాలయంలో క్షుద్రపూజలు చేసిన ఘనత నారా లోకేశ్‌దే. - బ్రాహ్మణ వీధిలో గోశాలను కూలగొట్టిన ఘనత టీడీపీ వారిదే. గోవులకు నిలువ నీడ లేMýంండా చేశారు. - నదీ తీరంలో పురోహితులకు చోటు లేకుండా చేసిన ఘనత కూడా టీడీపీదే. - మేం 11 అంశాలతో ఒక చార్జ్‌షీట్ పెడుతున్నాం. లోకేశ్, చంద్రబాబులు వాటికి సమాధానం చెప్పాలి. - జగనన్న కాలనీల కింద 90 వేల మందికి ఇళ్ల స్థలాలు అందించిన ఘనత మాది. - నీ ముందు ఐదేళ్లలో నువ్వేం చేశావో ముందు వైశ్యులకు, ముస్లింలకు, బ్రాహ్మణులకు ఏం చేశావో చెప్పు లోకేశ్. - మీ హయాంలో ముస్లింలకు మంత్రి పదవి ఎందుకివ్వలేదో సమాధానం చెప్పు. - ఆర్5 జోన్‌లో విజయవాడ వారికి 30వేల మందికి ఇళ్ల పట్టాలిస్తుంటే మీ పార్టీ అధ్యక్షుడు వాటిని రద్దు చేస్తానని చెప్తున్నాడు. - నిన్న విజయవాడ వచ్చిన లోకేశ్ దానికి ఎందుకు సమాధానం చెప్పలేదు..? - అధికారంలో లేకుండానే తన పాదయాత్రలో 20వేల ఇళ్లకు శంకుస్థాపన చేశాడట..ఇది ఎలా సాధ్యం..? - ప్రభుత్వం పోయిన తర్వాత, మళ్లీ రాని ప్రభుత్వానికి శంకుస్థాపనలు చేయడం పెద్ద జోక్. - ఆనాడు ప్రకాశం బ్యారేజీపై జగన్ గారు పాదయాత్ర చేస్తానంటే అనుమతి ఇవ్వలేదు. అనేక ఆంక్షలు పెట్టారు. - వారి ప్రభుత్వంలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని వేధింపులకు గురిచేశారు. ఎవడ్రా సైకో..నువ్వూ, నీ బాబూ, ఆయన దత్తపుత్రుడు సైకోలు: - రుషికొండలో ప్రభుత్వ భవనాలు కడుతుంటే దోచేస్తున్నారని పవన్ కల్యాణ్ అనడం విడ్డూరంగా ఉంది. - ఇదే అమరావతిలో మా భూములు ఇచ్చేది లేదంటూ రైతులు రోడ్లమీదకు వస్తే అక్రమంగా కేసులు పెట్టినప్పుడు నీ జనసేన ఏమైంది..? - టీడీపీ నేతలంతా ఇన్‌సైడర్ ట్రేండింగు ద్వారా భూములు కొట్టేస్తే నువ్వెందుకు మాట్లాడలేదు పవన్ కల్యాణ్.? - ఎవడ్రా సైకో..నువ్వు సైకో..నీ బాబు సైకో...అందుకే సైకోలంతా గత ఎన్నికలో ఓడిపోయారు.. - చరిత్రలో అధికారంలో ఉండి 23 సీట్లకు పడిపోయిన పార్టీ ఏదైనా ఉందా..? - మీరు సైకోల్లా పేదప్రజల పట్ల ప్రవర్తించారు కాబట్టే మీకు ఆ గతి పట్టింది. - నువ్వూ..మీ అయ్య...అరువు తెచ్చుకున్న మీ సోదరుడు..సైకోలు. - ఆటోనగర్ కి మంచినీళ్లు కావాలని అడిగితే నీళ్లు నిలుపుదల చేసిన ఘనత టీడీపీ వారిది. - ఇప్పుడు మళ్లీ వారికి మాయమాటలు చెప్పేందుకు ప్రయత్నం చేస్తూ సమావేశాలు పెడుతున్నాడు. - లోకేశ్ వళ్లు దగ్గర పెట్టుకో...నోరు అదుపులో పెట్టుకో..ఎలా పడితే అలా మాట్లాడితే బాగోదు. - విజయవాడ నగరం వైఎస్సార్సీపీ అడ్డా...నువ్వు ఏది పడితే అదిమాట్లాడితే కుదరదు. - అవాస్తవాలపై పునాధులు నిర్మించుకుంటాం అంటే కచ్చితంగా అది కుప్పకూలి పోతుంది. లోకేశ్ యాత్రకు బాహుబలి రేంజ్ బిల్డప్పులు: దేవినేని అవినాష్ - నారా లోకేశ్ పాదయాత్రకు బాహుబలి స్థాయిలో బిల్డప్ ఇచ్చారు..కానీ సంపూర్ణేష్ బాబు సినిమాలా మారింది. - ఆయన పాదయాత్రకు వాళ్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు రాకపోతే పక్క జిల్లాలు, నియోజకవర్గాల నుంచి రప్పించుకున్నారు. - డబ్బులిచ్చి, మందుపోసి ఇతర ప్రాంతాల వారితో లోకేశ్ ఈవినింగ్ వాక్ చేస్తున్నాడు. - నువ్వు పాదయాత్ర చేసేటప్పుడు గత ఐదేళ్లలో ఏం చేశావో చెప్పే సత్తా ఉందా..? - మళ్లీ మేం వచ్చాక మీ భవిష్యత్తుకు గ్యారెంటీ అంటున్నారు. 14 ఏళ్లుగా మీరు ఇవ్వని గ్యారెంటీ ఇప్పుడెలా ఇస్తారు..? - దీనికి లోకేశ్ సమాధానం చెప్పాలి. జగన్ గారు ఇచ్చిన మాటను ఎలా నెరవేస్తున్నారో లోకేశ్ తెలుసుకోవాలి. - ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన దమ్మున్న నాయకుడు శ్రీ వైఎస్ జగన్. - గత ఐదేళ్లలో విజయవాడ నగరం జగన్ గారి నాయకత్వంలో మౌలిక వసతుల కల్పనలో ముందుంది. - గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం విజయవాడ నగరాన్ని మోసం చేసింది. - రిటైనింగ్ వాల్, ఫ్లై ఓవర్ వంటి అనేక నిర్మాణాలు చేపట్టారు. - టీడీపీ హయాంలో పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌ని సింగపూర్ కంపెనీకి కట్టబెట్టాలి అనుకుంటే అక్కడ మహనీయుడు అంబేద్కర్ విగ్రహం పెడుతున్న ఘనత జగన్ గారిది. - మాట్లాడితే లోకేశ్ సైకో సైకో అంటున్నాడు... - వైయస్ఆర్ పాదయాత్ర చేసిన తర్వాత నాకు కోపం తగ్గిందని చెప్పారు. - వైయస్ జగన్ గారు కూడా అదే చెప్పారు. మొన్న రాహుల్ గాంధీ కూడా అదే చెప్పాడు. ఇళ్ల స్థలాలను అడ్డుకున్న లోకేశ్ విజయవాడ వాసులకు క్షమాపణ చెప్పాలి: - కానీ నారా లోకేశ్ మాత్రం ఒక ఎర్రబుక్కు పట్టుకుని అసలైన సైకోలా ఊగిపోతున్నాడు. - ఆయన చేసే పాదయాత్ర వల్ల చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేడు...లోకేశ్ ఎమ్మెల్యే కాలేడు. - నిన్న లోకేశ్ సెక్యూరిటీ వారికి కనీసం బోజన సదుపాయాలు కూడా కల్పించలేని పార్టీ టీడీపీ. - లోకేశ్ నువ్వు నగరంలో పాదయాత్ర ముగించే ముందు విజయవాడ వాసులకు క్షమాపణ చెప్పాలి. - జగన్ గారి నాయకత్వంలో విజయవాడ వాసులు 24 వేలమందికి అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇస్తే కోర్టులో కేసు వేసింది టీడీపీనే. - పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే అడ్డుకున్న పార్టీ మళ్లీ స్థలాలు ఇస్తామంటే ఎలా నమ్ముతారు..? - రాష్ట్రంలో 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన మనసున్న ప్రభుత్వం జగన్‌గారిది. - నీ పచ్చ మీడియా నిన్ను జాకీలేసి లేపాలనుకున్నా లేవలేని పరిస్థితి ఉంది.