బీసీ రిజర్వేషన్‌ బిల్లు పెట్టిన ఏకైక సీఎం వైయ‌స్‌ జగన్‌

మాజీ మంత్రి కొలుసు పార్థ‌సార‌ధి
 

విజ‌య‌వాడ‌: బీసీ రిజర్వేషన్‌ బిల్లు అసెంబ్లీలో పెట్టిన ఏకైక సీఎం వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి మాత్ర‌మే అని మాజీ మంత్రి కొలుసు పార్థ‌సార‌ధి కొనియాడారు. బీసీలే ఈ రాష్ట్రానికి వెన్నెముక అని సీఎం వైయ‌స్ జగన్‌ భావించార‌ని తెలిపారు. విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించిన జ‌య‌హో బీసీ మ‌హాస‌భ‌లో పార్థ‌సార‌ధి మాట్లాడారు. తోకలు కత్తిరిస్తా, తోలు తీస్తా అని చంద్రబాబు బీసీలను బెదిరించారు. కానీ, బీసీలే రాష్ట్రానికి వెన్నెముక అని సీఎం వైయ‌స్ జగన్‌ భావించారు. బీసీలకు సీఎం వైయ‌స్ జగన్‌ ఏం చేశారో ఈ సభను చూస్తే తెలుస్తుందని అన్నారు. బీసీలే ఈ రాష్ట్రానికి వెన్నెముక అనే భావజాలాన్ని తెచ్చింది కూడా సీఎం వైయ‌స్ జగనే అని పార్థసారథి పేర్కొన్నారు.  రాష్ట్రంలో బీసీలకు సీఎం జగన్‌ పెద్దపీట వేశారు. గతంలో కాళ్లు అరిగేలా తిరిగినా సంక్షేమ పథకాలు వచ్చేవి కావు. కానీ,  జగన్‌ పాలనలో ఇంటి గడపకే సంక్షేమ పథకాలు వస్తున్నాయి. బీసీ రిజర్వేషన్‌ బిల్లు పెట్టిన ఏకైక సీఎం వైయ‌స్‌ జగన్‌ మాత్రమే అని పార్థసారథి పేర్కొన్నారు.

Back to Top