దమ్ముంటే చంద్రబాబు మేనిఫెస్టో హామీల అమలుపై చర్చకు రావాలి

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని స‌వాల్‌

చంద్రబాబు భజన బృందంతో ఎన్టీఆర్‌ శత జయంతి నిర్వహించారు

మహానాడులో చంద్రబాబు భజన తప్ప..ఎన్టీఆర్‌ గురించి మాట్లాడింది లేదు

చంద్రబాబును ఆల్‌ఫ్రీ బాబు అని వైయస్‌ఆర్‌ ఆనాడే చెప్పారు

చంద్రబాబు దొంగ, 420, ఔరంగజేబు అని ఎన్టీఆరే అన్నారు

చంద్రబాబు పేదలకు కనీసం సెంటు స్థలం కూడా ఇవ్వలేదు

రాష్ట్రంలో చంద్రబాబు ఎవరికైనా ఉద్యోగం ఇచ్చాడా?

మహానాడు వేదికపైన బాలకృష్ణ బొమ్మ ఎందుకు పెట్టలేదు

ఎమ్మెల్యేగా కూడా గెలవని లోకేష్‌  బొమ్మ ఎలా పెడతారు

చంద్రబాబు వెనుక బీసీలెవరూ లేరు

చంద్రబాబుకు అధికారం ఇస్తే తన సామాజిక వర్గానికే మంత్రి పదవులు ఇస్తారు

చంద్రబాబు లాంటి దుర్మార్గుడిని ప్రజలు నమ్మొద్దు

టీడీపీని ఎన్టీఆర్‌ వారసులకు అప్పగించాలి

తాడేప‌ల్లి:  మేనిఫెస్టో హామీల అమ‌లుపై ద‌మ్ముంటే చంద్ర‌బాబు చర్చ‌కు రావాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ మంత్రి కొడాలి నాని స‌వాలు విసిరారు. 2004, 2009లో ఇచ్చిన వాగ్దానాల్లో పూర్తి చేయలేదని ఒకటి చూపించినా వైయ‌స్ఆర్‌సీపీని మూవేస్తాo.. 2014లో టీడీపీ మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్క హామీ చంద్రబాబు అమ‌లు చేయ‌లేద‌ని విమ‌ర్శించారు.  అదే దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి 2004లో ఇచ్చిన ప్రతీ హామీ నెర‌వేర్చార‌ని చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చినవే కాకుండా ఇవ్వని పథకాలు కూడా అమలు చేశారు. 2019లో రైతుల రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు మాట తప్పారు. డ్వాక్రా రుణాలు మాఫీ అని చెప్పి మాఫీ చేయలేదు. చంద్రబాబు ఐదేళ్లలో పెన్షన్లకు రూ.22వేల కోట్లు ఖర్చు చేశారు. అదే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.97వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. సెంటు స్థలం ఇస్తే సమాధికి సరిపోదు అంటున్నారు. 14ఏళ్లు అధికారంలో ఉండి చంద్రబాబు పేదలకు ఎందుకు ఇళ్లు ఇవ్వలేద‌ని ప్ర‌శ్నించారు. సోమ‌వారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.

కొడాలి వెంకటేశ్వరరావు (నాని) ఏం మాట్లాడారంటే..:

అసలు నీకా అర్హత ఉందా?:
    ఎన్టీఆర్‌ శత జయంతిని ఘనంగా చేశామని, ఆ సందర్భంగా పార్టీ మహానాడు నిర్వహించామని తెలుగుదేశం పార్టీ నాయకులు గొప్పలు చెబుతున్నారు. నిజానికి ఏటా ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా మహానాడు నిర్వహించడం ఆనవాయితీ. నిన్న కూడా అలాగే జరిగింది. అంతేతప్ప, శత జయంతి అంటూ ప్రత్యేకత ఏదీ లేదు.
    పనికిరాని స్క్రాప్‌ (చెత్త మనుషులు)ను పట్టుకొచ్చి, వారితో పొడిగించుకోవడం మినహా చంద్రబాబు చేసిందేమీ లేదు. హైదరాబాద్‌లో ఒక సమావేశం నిర్వహించారు. దాన్ని పక్కాగా పార్టీ సమావేశంలా నిర్వహించారు. ఇక ఎన్టీఆర్‌ శత జయంతి సందర్భం.. అంటూ నిర్వహించిన మహానాడులో ఎవరు మాట్లాడినా.. రెండు నిమిషాలు మాత్రమే ఎన్టీఆర్‌ గురించి మాట్లాడి.. ఆ తర్వాత సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ను, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని తిట్టడం.. ఆ తర్వాత చంద్రబాబును పొగడడం. అదే మహానాడులో జరిగింది.
    నిజానికి ఆనాడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, ఆయన పదవిని, పార్టీని లాక్కుని.. చివరకు ఆయన అకాల మరణానికి కారకుడైన చంద్రబాబుకు, ఎన్టీఆర్‌ శత జయంతి నిర్వహించే హక్కు ఏ మాత్రం లేదు.

మీరా వారసులు?:
    వేదికపై చంద్రబాబు, లోకేష్‌ ఫోటోల మధ్య ఎన్టీఆర్‌ ఫోటో పెట్టారు. మీరు ఆయన వారసులు కాదు కదా?. ఎన్టీఆర్‌ రక్తం పంచుకు పుట్టిన బాలకృష్ణ ఉన్నాడు. ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా గెల్చారు. మంత్రిగా ఉండి మంగళగిరిలో ఓడిపోయిన నీ కొడుకు ఫోటో మాత్రం వేదికపై పెట్టారు. ఇది ఎంత వరకు సబబు?
    ఎన్టీఆర్‌కు ఇంకా కొడుకులు, మనవళ్లు ఉన్నారు. మరి వారి ఫోటోలు ఎందుకు పెట్టలేదు? చివరకు లోకేష్‌ పాదయాత్రకు వెళ్లి, చనిపోయిన తారక్‌రత్న ఫోటో కూడా పెట్టలేదు. 
    ఎన్టీ రామారావు ఎందరినో నాయకులు, ఎమ్మెల్యేలను చేస్తే, వారిని వైస్రాయ్‌ హోటల్‌లో దాచిపెట్టి, చివరకు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి, పదవి, పార్టీని లాక్కుని చివరకు ఆయన ప్రాణం పోవడానికి కూడా కారణమయ్యావు. చివరకు ఎన్టీఆర్‌ అమలు చేసిన హామీలు కూడా నువ్వు కొనసాగించలేదు.
    రెండు రూపాయల కిలో బియ్యాన్ని రూ.5.50 చేశావు. ఎన్టీఆర్‌ వ్యవసాయ విద్యుత్‌ను హార్స్‌పవర్‌ను రూ.50 కే ఇస్తే, దాన్ని ఎత్తేశావు. కరెంటు చార్జీల పెంపుపై రైతులు ఆందోళన చేస్తే.. బషీర్‌బాగ్‌ వద్ద నలుగురిని కాల్చి చంపావు. ఎన్టీఆర్‌ అమలు చేసిన మద్యపాన నిషేధాన్ని ఎత్తి వేశావు.
ఒక్కరికి కూడా కనీసం సెంటు స్థలం ఇవ్వలేదు. ఒక్క ఇల్లూ కట్టించి ఇవ్వలేదు. అలాంటి నీవు.. నీ కొడుకు ఎన్టీఆర్‌కు వారసులు ఎలా అవుతారు?.

నీ మేనిఫెస్టోలపై ఇదే మా సవాల్‌:
    ఇక నిన్న మహానాడులో కొత్తగా మేనిఫెస్టో విడుదల చేశారు.
చంద్రబాబు నీవు ఇప్పటి వరకు ఎన్ని మేనిఫెస్టోలు ప్రకటించావు? వాటిలో ఎన్నింటిని అమలు చేశావు?
    1999లో మళ్లీ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చావు. 2004లో ఓడిపోయావు. ఆ తర్వాత కూడా ఓడిపోయావు. తిరిగి 2014లో గెల్చావు. నీవు ఇచ్చిన హామీలు నిజంగా నిలబెట్టుకుని ఉంటే.. నీకు నిజంగా ఆ ధైర్యం ఉంటే..
    నీవు 1994లో ఎన్టీఆర్‌ ప్రకటించి మేనిఫెస్టోను, 1999లో నీవు విడుదల చేసిన మేనిఫెస్టోను.. ఆ తర్వాత 2014లో ప్రకటించిన మేనిఫెస్టో తీసుకుని బహిరంగ చర్చకు రా. ఎక్కడైనా సరే..
    మేము జగన్‌గారు 2019లో ప్రకటించిన మేనిఫెస్టోను.. వైయస్సార్‌ గారు 2004లోనూ, ఆ తర్వాత 2009లోనూ విడుదల చేసిన మేనిఫెస్టోలు తీసుకొస్తాం.  నిజానికి వైయస్సార్‌గారు మేనిఫెస్టోలో చెప్పనివి కూడా ఎన్నో చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, 108, 104 సర్వీసుల గురించి మేనిఫెస్టోలో చెప్పకపోయినా, వాటిని పక్కాగా అమలు చేశారు. ఆ విధంగా ఇవ్వని హామీలు కూడా ఆయన అమలు చేశారు. 
-మేనిఫెస్టో హామీల అమలుపై చర్చించే దమ్ముందా?
    అదే నీవు ఏం చేశావు? 2009లో మహాకూటమి ఏర్పాటు చేసుకుని, ఆల్‌ ఫ్రీ అని ప్రకటించావు. అదే వైయస్సార్‌గారు బియ్యం నాలుగు కేజీలకు బదులు 5 కేజీలు ఇస్తామని, వ్యవసాయానికి 7 గంటలకు బదులు 9 గంటలు విద్యుత్‌ సరఫరా చేస్తామని చెప్పారు.
ఆయనను నమ్మిన ప్రజలు, మిమ్మల్ని ఓడించి, ఆయనను గెలిపించారు. ఎందుకంటే నీవు ఒక 420 అని ప్రజలకు తెలుసు.

2014లోనూ పచ్చి దగా:
    ఆ తర్వాత 2014లో ఏం చేశావు? 650 వాగ్దానాలు ఇచ్చావు. పవన్‌కళ్యాణ్, బీజేపీతో పొత్తు పెట్టుకున్నావు. చంద్రబాబును ప్రశ్నిస్తాను. ఆయనకు ఓటేయండి అని దొంగ మాటలు చెప్పిన పవన్‌కళ్యాణ్‌.. ఏదీ అడగలేదు. అలా పవన్‌కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరూ మాట తప్పారు. బాబు ఏకంగా వాగ్దానాలను గాలికి వదిలేశాడు. గెలవగానే 5 సంతకాలు పెడతానన్నాడు. 
    రైతు రుణాల మాఫీ. రూ.87,612 కోట్లు. కానీ ఎంత రద్దు చేశాడు? కనీసం 10 శాతం రుణాలు కూడా మాఫీ చేయలేదు.
డ్వాక్రా మహిళల రుణాలు రద్దు చేస్తానని చెప్పి, ఆ మాట కూడా తప్పాడు. బెల్టుషాపులు రద్దు చేస్తానన్నాడు. ఆ పనీ చేయలేదు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యుత్‌ అన్నాడు. గవర్నమెంటు స్కూళ్లు నాశనం చేశాడు. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో లక్షల ఫీజుల వసూలుకు అనుమతి ఇచ్చాడు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నాశనం చేశాడు. 108, 104 సర్వీసులను షెడ్లకే పరిమితం చేశాడు.
    650 వాగ్దానాలు ఇచ్చి.. రైతులు, మహిళలు, యువత.. అందరినీ మోసం చేశాడు. ఇంటింటికీ ఉద్యోగం ఇస్తానన్నాడు. ఆ పని చేయకపోతే, రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. కానీ, ఎప్పుడు, ఎంత మందికి ఇచ్చాడు?. అలా అందరినీ మోసం చేశావు.

నీకు, జగన్‌గారికి పోలికా?:
    ఇంకా పెన్షన్‌ రూ.2 వేలు ఇచ్చానని పదే పదే చెబుతున్నాడు. కానీ నిజానికి చంద్రబాబు ఆ పెంచిన పెన్షన్‌.. 2019లో జనవరి నుంచి మాత్రమే, ఏప్రిల్‌ వరకు రూ.2 వేల పెన్షన్‌ ఇచ్చాడు. 2014లో గెల్చిన తర్వాత, 5 నెలల పాటు కేవలం రూ.200 పెన్షన్‌ మాత్రమే ఇచ్చి, ఆ తర్వాత 50 నెలల పాటు రూ.1000 మాత్రమే ఇచ్చావు. అది కూడా 37 లక్షల మందికి మాత్రమే. అంటే నీ 5 ఏళ్ల పాలనలో ఒక్కో పెన్షనర్‌కు రూ.60 వేలు మాత్రమే ఇచ్చావు.
    అదే జగన్‌గారు.. 2019లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రూ.2 వేల పెన్షన్‌ ఇచ్చి, ఆ తర్వాత ఏడాది రూ.2250, రూ.2500 ఇవ్వడంతో పాటు, ఇప్పుడు రూ.2750 ఇస్తున్నారు. దాన్ని రూ.3 వేలకు పెంచుతున్నాడు. అది కూడా 64 లక్షల మందికి పెన్షన్‌ ఇస్తున్నాడు.
అంటే జగన్‌గారు, తన 4 ఏళ్ల పాలనలో నెలకు 64 లక్షల మందికి ఇస్తున్నారు. సగటున రూ.2500 వేసుకున్నా, ఈ 60 నెలల్లో ఆయన ప్రతి పెన్షనర్‌కు ఇచ్చిన మొత్తం రూ.1.5 లక్షలు అయితే.. చంద్రబాబు తన 5 ఏళ్ల పాలనలో ఇచ్చిన సగటు పెన్షన్‌ రూ.60 వేలు మాత్రమే.
    37 లక్షల మందికి పెన్షన్ల కింద చంద్రబాబు 5 ఏళ్లలో కేవలం రూ.22 వేల కోట్లు మాత్రమే అయితే, జగన్‌గారు ఈ 4 ఏళ్లలో రూ.97 వేల కోట్లు ఇచ్చారు. అందుకే.. చంద్రబాబుకు, జగన్‌గారికి ఎక్కడైనా పోలిక ఉందా?
    45 ఏళ్లు దాటిన మహిళలకు ఏటా రూ.18750 ఇస్తున్నారు. అంటే నెలకు రూ.1500కు పైగానే. ఇప్పుడు చంద్రబాబు, అదే మహిళలకు నెలకు రూ.1500 ఇస్తాసంటున్నాడు. గతంలో 6వ తరగతి పిల్లలకు ల్యాప్‌టాప్‌లు ఇస్తానన్న చంద్రబాబు, ఒక్కరికి కూడా ఇవ్వలేదు.
ఒక్కరిని కూడా కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా చదివించలేదు.
అదే జగన్‌గారు.. స్కూళ్లను నాడు–నేడు కింద పూర్తిగా మారుస్తున్నాడు. విద్యాదీవెన కింద ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన కింద హాస్టల్‌ ఖర్చులు ఇస్తున్నారు.

ఆ 14 ఏళ్లు ఏం చేశావు?:
    14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు, ఒక్క మంచి పనీ చేయలేదు. మరి ఇప్పుడు వచ్చి, తనకు ఓటేస్తే.. నిరుపేదలను ధనవంతులను చేస్తానంటున్నాడు. మరి ఆ 14 ఏళ్లు ఏం చేశావు? ఒక్కరికి కూడా ఇంటి స్థలం, ఇల్లు ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తానంటున్నాడు. ఎంతసేపూ జగన్‌గారిని, వైయస్సార్‌ కాంగ్రెస్‌ను తిట్టడం తప్ప. అడ్డమైన వెధవలను తీసుకొచ్చి, మాట్లాడించి, మమ్మల్ని తిట్టిస్తున్నాడు.

కాపీ పథకాలు ప్రకటిస్తున్నాడు:
    అమ్మ ఒడి పథకాన్ని కాపీ కొట్టి, పిల్లలకు రూ15 వేలు ఇస్తానంటున్నాడు. కర్నాటకలో బీజేపీ ఇచ్చిన హామీ, పేదలకు ఏటా 3 సిలిండర్లు. అక్కడ కాంగ్రెస్‌ హామీ మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం.. అలా అన్నీ కాపీ హామీలే. 

అది దీవెన కాదు. ఆగ్రహం:
    2003 మహానాడు తిరుపతిలో నిర్వహిస్తే, గాలివానకు అన్నీ కొట్టుకుపోయాయి. నేను అప్పుడు ఆ పార్టీలోనే ఉన్నాను. ఆ గాలి వాన గురించి చెబుతూ.. శ్రీ వెంకటేశ్వరస్వామి, ఎన్టీఆర్‌ ఆశీస్సులతో అలా జరిగిందని అన్నాడు. కానీ 2004లో ఏం జరిగింది? ప్రజలు ఈడ్చి పారేశారు.
    నిన్న రాజమండ్రిలో కూడా మళ్లీ అదే మాట అన్నాడు. గాలి వానకు హోర్డింగ్‌ పడిపోతే.. దేవుడు, ఎన్టీఆర్‌ ఆశీస్సులని అంటున్నాడు. అందుకే 2024లో కూడా చంద్రబాబును ప్రజలు ఈడ్చి అవతల పారేయబోతున్నారు.

ఎవరు బీసీలు? నీ వెనక ఉన్నదెవరు?:
    బీసీలు నీకు వెన్నెముక అంటున్నావు. నిజానికి ఎన్టీఆర్‌ను ఆరాధించిన వారు, ఆయనను దేవుడిగా చూసిన వారు బీసీలు. వారి వల్లనే ఆయన పదవిలోకి వచ్చారు. బీసీల గురించి పరితపించిన నేత ఎన్టీ రామారావు. మరి బీసీలు చంద్రబాబుకు ఎలా వెన్నెముకలు అవుతారు?
    నిజానికి చంద్రబాబుకు వెన్నెముకలు.. రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడు, చంద్రబాబు. వారు బీసీలు కాదు కదా? అంటే నీవు అధికారంలోకి వస్తే, బాగు పడేది వారే. వారితో కలిసి దోచుకోవడమే నీ పని.

వారు జగన్‌గారి వెంటే..:
    అదే బీసీలు ఇవాళ జగన్‌గారి వెంట ఉన్నారు. పథాకాల్లో బీసీలకే ఎక్కువ ప్రయోజనాలు దక్కుతున్నాయి. ఒక్క ఆంధ్ర ప్రాంతంలో చూస్తే.. ఆనాడు వైయస్సార్‌గారు, నేడు జగన్‌గారు దాదాపు 55 లక్షలకు పైగా ఇళ్లు కట్టిస్టుంటే.. వాటిలో బీసీలకు 40 లక్షల ఇళ్లు దక్కాయి. మరి నీది బీసీల పార్టీ అయితే.. వారి కోసం ఏం చేశావు? అన్నీ దొంగ మాటలు. అబద్ధాలు, 420 మాటలు. బీసీలకు ఏ విధంగా న్యాయం చేశావు? వారిని ఏ విధంగా అయినా పైకి తీసుకొచ్చావా? నీ గురించి ఎన్టీ రామారావు, ఆనాడే చెప్పాడు. నీవొక 420 అని. నిన్ను అస్సలు నమ్మొద్దని.

విలువలు లేని రాజకీయాలు:
    ఇవాళ జూనియర్‌ ఎన్టీఆర్‌ను పలురకాలుగా అణగదొక్కుతున్నాడు. సినిమా నిర్మాతలను వేధించాడు. జూనియర్‌ ఎన్టీఆర్‌ తల్లిని కూడా తిట్టిస్తున్నాడు. మరోవైపు తన భార్య గురించి, ఏమీ అనకపోయినా, వెక్కి వెక్కి ఏడ్చిన చంద్రబాబుకు.. ఆడవాళ్లంటే కేవలం తన ఇంటి వారు మాత్రమేనా?

బాబు దృష్టిలో వారే బీసీలు:
    చంద్రబాబు మళ్లీ ఇప్పుడు అసత్యాలు చెబుతున్నాడు. అందుకే ఆయన్ను నమ్మి ఓటేస్తే.. బీసీలకు మళ్లీ అన్యాయం చేస్తాడు. చంద్రబాబు అధికారంలో ఉంటే.. మా వాళ్లు ఒక ఆరుగురికి మంత్రి పదవులు ఇస్తాడు. వారు కూడా ఎవరంటే.. దేవినేని ఉమ, పత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్, నారా లోకేష్, చంద్రబాబునాయుడు, పరిటాల సునీతకు మంత్రి పదవులు ఇస్తాడు. లేకపోతే భూమా అఖిలప్రియ, ఆదినారాయణరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నారాయణ వంటి వారికి పదవులు ఇస్తాడు. ఎందుకంటే బాబు దృష్టిలో వారంతా బీసీలు.

నిజమే. క్యాష్‌వార్‌:
    చంద్రబాబు మరో మాట చెబుతున్నాడు. ఇప్పుడు జరగబోయేది క్యాష్‌ వార్‌ అని. అది నిజమే.. చంద్రబాబు ఓడిపోయిన తర్వాత.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 అన్నీ నష్టాల పాలయ్యాయి. అందుకే చంద్రబాబును ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని, ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే, వీరంతా ఇప్పుడు రామారావు పేరు చెప్పుకుని బతుకుతున్నారు. 

అప్పుడే.. ఎన్టీఆర్‌కు న్యాయం:
    అంత మహానుభావుడైన ఎన్టీఆర్‌ పుట్టిన రోజున చంద్రబాబు మోసాల మేనిఫెస్టో విడుదల చేయడం దారుణం. చంద్రబాబు ఒక ఫోర్‌ ట్వంటీ. అందుకే ఆయన పుట్టిన రోజున మేనిఫెస్టో విడుదల చేసి ఉంటే బాగుండేది.
ఎన్టీఆర్‌ శత జయంతి అంటూ.. ఆయన కుటుంబ సభ్యులను పూర్తిగా దూరంగా పెట్టిన చంద్రబాబుకు, ఆయన కొడుకునూ.. వచ్చే ఎన్నికల్లో భూస్థాపితం చేయాలి. అప్పుడే ఎన్టీఆర్‌కు న్యాయం చేసినట్లు అవుతుంది.

 చెత్త, పనికి మాలిన మాటలు:

    అన్నీ తానే కట్టానని చంద్రబాబు అంటాడు. హైదరాబాద్‌ కూడా తానే కట్టానని అంటున్నాడు. మరి హైదరాబాద్‌లో ఒక్క సీటు అయినా గెలుస్తాడా? అమరావతిని బ్రహ్మాండంగా కట్టానని హైదరాబాద్‌లో చెప్పాడు. ఇక్కడికి వచ్చి చూస్తే అందరికీ అన్నీ అర్ధం అవుతాయి.
- అన్నీ చెత్త మాటలు. పనికిమాలిన మాటలు.
    ఎక్కడెక్కడివో, వేర్వేరు పార్టీలు, వేర్వేరు రాష్ట్రాల మేనిఫెస్టోలు చూడడం, కాపీ కొట్టడం.. ఇక్కడ ప్రకటించడం అదే చంద్రబాబు విధానం. అలా ఎలాగోలా.. మళ్లీ అధికారంలోకి రావాలన్నదే ఆయన లక్ష్యం. అందరినీ అన్ని విధాలుగా మోసం చేసిన చంద్రబాబును, ఆయన కొడుకుని వచ్చే ఎన్నికల్లో భూస్థాపితం చేస్తారు.

    ప్రజలను నమ్మించేందుకు ఇప్పుడు కూడా అమలు చేయలేని హామీలు ఇస్తున్నాడు. తనది ఆకర్షణీయమైన మేనిఫెస్టో అంటున్నాడు. ఇదేమైనా బట్టల బిజినెస్సా? అందంగా చూపించడానికి? అని మాజీ మంత్రి శ్రీ కొడాలి నాని గుర్తు చేశారు.

Back to Top