2024 ఎన్నికల్లో టీడీపీకి వచ్చేవి నాలుగు సీట్లే 

మాజీ మంత్రి కొడాలి నాని
 
 ఎన్టీఆర్‌కు ఎందుకు వెన్నుపోటు పొడవాల్సి వచ్చిందో చంద్రబాబు చెప్పాలి

 ఎన్టీఆర్‌+ వైయ‌స్ఆర్‌ కలిపితే వైయ‌స్‌ జగన్‌

తాడేప‌ల్లి:  2024 ఎన్నిక‌ల్లో టీడీపీకి వ‌చ్చేవి నాలుగు సీట్లే అని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు, మాజీ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. గ‌తంలో 23 మంది వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేశారు. 2019లో చంద్రబాబుకు 23 సీట్లే వచ్చాయి. ఇప్పుడు నలుగురిని లాక్కున్నారు.. వచ్చే ఎన్నికల్లో నాలుగు సీట్లే వస్తాయ‌ని కొడాలి నాని ఎద్దేవా చేశారు. పేద ప్రజల శ్రేయస్సు కోసం ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించారని అన్నారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో బుధవారం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.
 

మాజీ మంత్రి  కొడాలి వెంకటేశ్వరరావు (నాని) మీడియాతో ఇంకా ఏం మాట్లాడారంటే:

సమాధానం చెప్పాకే పేరు ఎత్తాలి:

  • పార్టీని స్థాపించిన ఎన్టీఆర్‌కి ఎందుకు వెన్నుపోటు పొడవాల్సి వచ్చిందో చంద్రబాబు సమాధానం చెప్పాలి
  • ఆయన్ను ఎందుకు సిఎం కుర్చీ నుంచి దించాల్సి వచ్చిందో చెప్పాలి
  • ఈరోజు టీడీపీ ఎన్టీఆర్‌ సిద్ధాంతాలతో నడుస్తోందని, ఆయన మాకు దేవుడు అంటూ కథలు చెప్తున్నారు
  • అటువంటి ఎన్టీఆర్‌ను బతికుండగా మీరు ముఖ్యమంత్రిగా ఎందుకు తప్పించారు
  • ఎన్టీఆర్‌ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఎందుకు సస్పెండ్‌ చేశారు..?
  • ఆయన స్థాపించిన పార్టీని, ట్రస్టులను, ఆయన సాధించిన ముఖ్యమంత్రి పదవిని మీరు ఎందుకు తీసుకున్నారు..?
  • ఈరోజు వరకూ ఈ ప్రశ్నలకు చంద్రబాబు కానీ, ఆ పార్టీలో నాయకులు కానీ సమాధానం చెప్పారా..?
  • ఎన్టీఆర్‌ కాళ్లు పట్టుకుని ఎందుకు కిందపడేశారో చెప్పాలి
  • ఈరోజన్నా ప్రజల ముందుకు వచ్చి అటువంటి మహానుభావుడ్ని ఎందుకు కుప్పకూల్చావో చెప్పు చంద్రబాబూ...
  • లేదంటే చరిత్రలో చంద్రబాబు ఒక 420లా మిగిలిపోతాడు.

పెత్తందార్ల చేతిలో పార్టీ:

  • ఆయన పుట్టిన రోజుకు, వర్ధంతికి రామారావే మాకు ఆదర్శం అంటారు తప్ప ఎందుకు చంపారో చెప్పరు
  • చంద్రబాబు పార్టీని తీసుకుని ఏం సా«ధించాడు..? ఎన్టీఆర్‌ పెట్టిన కిలో రెండు రూపాయల బియ్యం ఎత్తేశాడు
  • పేదవాడికి కట్టే పక్కా ఇళ్లు, హార్స్‌పవర్‌ 50 రూపాయల కరెంట్, మద్యపాన నిషేదాన్ని ఎత్తేశాడు
  • ఆయన పెట్టిన పథకాలను చంద్రబాబు ఒక్కటి కూడా ఉంచలేదు
  • పేదల కోసం పెట్టిన పార్టీని పెత్తందార్ల చేతిలో పెట్టాడు
  • రాజ్యసభ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు అమ్ముకుని పార్టీని వ్యాపార సంస్థగా మార్చాడు
  • చంద్రబాబు, ఆయన కొడుకు ఈరోజు అపర కోటీశ్వరుల్లా మారారు
  • తండ్రిలాంటి, దేవుడి లాంటి ఎన్టీఆర్‌కి ద్రోహం చేసిన చంద్రబాబు ఒక నీచుడు

నాడు ఎన్టీఆర్‌.. వైఎస్సార్‌.. నేడు వైఎస్‌ జగన్‌..ఇదే చరిత్ర:

  • ఎన్టీఆర్‌ తర్వాత ఈ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి
  • ముప్పై ఏళ్లు కాంగ్రెస్‌ పార్టీ ఏ పదవులు ఇవ్వకపోయినా ఆ పార్టీని నమ్ముకున్న వ్యక్తి వైఎస్సార్‌
  • కాంగ్రెస్‌ పార్టీనే తన వెనుక నడిచేలా చేసుకున్న గొప్ప పోరాట యోధుడు రాజశేఖరరెడ్డిగారు
  • పాదయాత్ర చేసి నిన్ను కూకటి వేళ్లతో పెకిలించిన వ్యక్తి రాజశేఖరరెడ్డి గారు
  • చెప్పిన మాట ప్రకారం సంక్షేమ పాలనను తీసుకొచ్చిన వ్యక్తి.. 17 లక్షలు ఉన్న పింఛన్లను 74 లక్షలు చేశాడు
  • 48 లక్షల మంది పేదలకు ఇళ్లు నిర్మించిన వ్యక్తి వైయ‌స్ రాజశేఖరరెడ్డి గారు
  • పేద పిల్లలు చదువు కోసం ఫీజ్‌ రీఎంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు పెట్టిన వ్యక్తి రాజశేఖరరెడ్డి గారు
  • రాజశేఖరరెడ్డి గారి పేరు చెప్తే ఆరోగ్యశ్రీ, పేదలకు ఇళ్లు వంటి అనేక పథకాలు గుర్తుకువస్తాయి
  • చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకు వచ్చేది వెన్నుపోటు, అందితే కాళ్లు లేదంటే జుట్టు గుర్తుకు వస్తాయి
  • తండ్రిని మించి మరిన్ని అడుగులు:

ఆనాడు ఎన్టీఆర్, వైయస్సార్‌ ఒక అడుగు వేస్తే జగన్‌ గారు రెండు అడుగులు వేసి సంక్షేమ పాలన అందిస్తున్నారు

  • ఆరోగ్య శ్రీలో వైయ‌స్సార్‌ గారు 900 జబ్బులు చేరిస్తే చంద్రబాబు దాన్ని 250కి కుదించాడు
  • వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు వచ్చి దాన్ని ఇప్పుడు 3వేలకు పైగా చేశాడు
  • ఫీజ్‌ రిఎంబర్స్‌మెంటు, విద్యాదీవెన, వసతిదీవెన లాంటి పథకాలు పేరు చెప్తే జగన్‌ గారు గుర్తుకు వస్తారు
  • ఎన్టీఆర్‌ మండల వ్యవస్థను తీసుకొచ్చి మండలాన్ని యూనిట్‌గా తీసుకుంటే జగన్‌గారు గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు
  • అలాంటి జగన్‌ గారిపై నువ్వు, నీ పార్టీ జగన్‌ గారి మీద పడి ఏడుస్తున్నారు

దేవుడు, ఎన్టీఆర్‌ నీ స్క్రిప్ట్‌ ఎప్పుడో రాశారు:

  • దేవుడు స్క్రిప్ట్‌ రాశాడని చంద్రబాబు అంటున్నాడు.. దేవుడు, ఎన్టీఆర్‌ కలిసి నీ స్క్రిప్ట్‌ రాశారు చంద్రబాబు
  • నీ కొడుకుకు ఎమ్మెల్సీగా ఆఖరు రోజు ఇదేనని వాళ్లు స్క్రిప్ట్‌ రాశారు
  • లోకేశ్‌కి ఉన్న ఏకైక పదవి కూడా ఊడిపోయిన రోజు అది
  • గెలిచామని అందర్నీ పండుగ చేసుకోమని చెప్పి.. చంద్రబాబు, ఆయన కొడుకు కుళ్లి కుళ్లి ఏడుస్తున్నారు
  • ఇది దేవుడి, ఎన్టీఆర్‌ ఇచ్చిన స్క్రిప్ట్‌.. నువ్వు చెప్పే మాటలన్నీ నీకే తగులుతాయి చంద్రబాబూ..?

చివరికి నీకు మిగిలేది ఆ నలుగురే:

  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలంతా చూశారు.. జగన్‌ అనే వ్యక్తి ఏ రకంగా నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నాడో
  • మేము 7గురు అభ్యర్థులను పెట్టాం... మాకు కరెక్టుగా ఒక్కొక్కరికి 22 మంది ఉన్నారు
  • టీడీపీకి ఉన్నది 19 మంది మాత్రమే. మా దగ్గర నుంచి వెళ్లిన ఇద్దర్నీ కలుపుకుంటే వారి బలం 21
  • కొంత మంది ఎమ్మెల్యేలు జగన్‌ గారి దగ్గరకు వెళ్లి సీటిస్తే ఓటేస్తాం అని చెప్పినా ఆయన ఇచ్చేది లేదని ధైర్యంగా చెప్పాడు
  • మీకు ప్రజల్లో బలం లేదు.. నాతో పాటు ఉండండి.. నన్ను నమ్మండి అన్నాడు తప్ప ఐదు, పది కోట్లిస్తానని చెప్పలేదు
  • చంద్రబాబులా దొంగమాటలు చెప్పి.. బీఫాం ఇస్తామని చెప్పి చివరన దొడ్డిదారిని వేరే వారికి బీఫాం ఇచ్చి పంపుతాడు
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో నువ్వేదో ఇరగదీశాను అని చెప్పుకుంటున్నావు.. మొన్న 23 మందిని చేర్చుకున్నావ్‌.. ఏం చేశావ్‌..?
  • ఆ 23 సీట్లు మాత్రమే వచ్చాయి.. ఆ 23 మందిలో ఒక్కరు తప్ప మిగిలిన వారంతా దిక్కు లేకుండా పోయారు
  • ఈరోజు నలుగురిని చేర్చుకుంటావ్‌.. దేవుడు మళ్లీ స్క్రిప్ట్‌ రాస్తాడు
  • చివరికి నీకు ఆ నలుగురే మిగులుతారు
  • 2019లో దేవుడు స్క్రిప్ట్‌ రాశాడు కాబట్టే నీకు 23 సీట్లు ఇచ్చాడు
  • 2024లో కూడా నలుగురిని చేర్చుకున్నావ్‌..
  • నీకు నాలుగు సీట్లు వస్తాయి. ఆ నలుగురు గెలవరు..
  • ఇది దేవుడి స్క్రిప్ట్‌ అంటే

వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు దొంగ మాటలు చెప్పరు:

  • ద్రోహం చేస్తారని తెలిసి కూడా వైయ‌స్ జగన్‌ గారు సీటు ఇవ్వలేననే చెప్పారు
  • నువ్వైతే ఒక కోటి ఇచ్చి ఆ తర్వాత అపాయింట్‌మెంటు కూడా ఇవ్వవు
  • ఇలాంటి చిల్లర రాజకీయాలు ఎన్టీఆర్, వైఎస్సార్‌ చేయలేదు. వైఎస్‌ జగన్‌ కూడా అస్సలు చేయరు
  • అందుకే వారు చరిత్రకారులు అయ్యారు
  • ఒక్కడుగా పోరాటం మొదలుపెట్టి ఈ దేశంలోనే ఒక శక్తివంతమైన నాయకుడిగా ఎదిగిన వ్యక్తి జగన్‌ గారు
  • పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పోడిచిన చరిత్ర నీది
  • ఎమ్మెల్యేలను కొని ముఖ్యమంత్రి అయిన దౌర్భాగ్యుడివి నువ్వు
  • ఓటు నోటు కేసులో ఎమ్మెల్యేలను కొంటూ దొంగలా దొరికి పోయి పారిపోయి కరకట్ట మీద దాక్కున్న వెదవవి నువ్వు
  • 23 మంది ఎమ్మెల్యేలను కొని వైయ‌స్ఆర్‌సీపీ ని చీల్చి వైయ‌స్ జగన్‌ గారిని భూస్థాపితం చేయాలని చూశావ్‌
  • ఏమైంది...కుక్కకాటుకు చెప్పుదెబ్బలా నీ దవడ పగిలిపోయాలా కొట్టారు
  • మళ్లీ కుట్ర కుతంత్రాలతో జగన్‌ గారు వదిలేసిన ఎంగిలి మెతుకులతో గెలిచిన కుక్కవు నువ్వు
  • నువ్వేదో విజయం సాధించాను గెలిపించాను అనే అర్హత నీకు లేదు
  • నిజంగా గెలుస్తుందనే ధైర్యం నీకుంటే కొడుకుని పెట్టేవాడు
  • గెలవదనే ఆ బీసీ అభ్యర్థి పంచుమర్తి అనురాధను పెట్టాడు...
  • చంద్రబాబులా జగన్‌గారు దొంగమాటలు చెప్పి ఉంటే చంద్రబాబు అభ్యర్థి గెలిచేదా..?

ఒంటరిగా గెలిచే సత్తా ఎక్కడుంది..?

  • టీడీపీకి హవా వచ్చిందట.. తన హయాంలో ఐదు సార్లు ఎన్నికలు జరిగితే ఈ చంద్రబాబు ఒకటిన్నర సార్లు మాత్రమే గెలిచాడు
  • 99లో వాజ్‌పేయ్‌ దయ వల్ల టీడీపీకి హవా వచ్చింది..గెలిచాడు
  • 2004లో ఓడిపోయాడు.. మళ్లీ 2009లో కూడా ఓడిపోయాడు
  • 2014లో రెండు రాష్ట్రాలుగా చేశాడు.. తెలంగాణా వదిలేసి ఆంధ్రాలో గెలిచి సగం గెలిచాను అనిపించుకున్నాడు
  • చంద్రబాబు హాయంలో 7సార్లు పార్లమెంటు ఎన్నికలు జరిగితే ఆరు సార్లు మెజార్టీ సీట్లను పోగొట్టుకున్నాడు
  • ఈయన ఇప్పుడు కొండలాంటి జగన్‌గారిని ఓడించి టీడీపీని గెలిపిస్తానంటే ఎవరు నమ్ముతారు..?
  • వైయ‌స్ఆర్‌  గారు వచ్చాక చంద్రబాబుకు గెలవడం సాధ్యమైందా..?
  •  

మేమేమీ కండువాలు కప్పలేదు:

  • చంద్రబాబుతో విభేదించి నలుగురు ఎమ్మెల్యేలు వైయ‌స్ జగన్‌గారి వైపు వచ్చారు.
  • తమకు వేరే సీట్లు ఇవ్వమని అడిగాడు. స్పీకర్‌ వారికిచ్చారు
  • 2024 ఎన్నికల్లో మా పార్టీ తరఫున పోటీ చేస్తామంటే.. వారికి ప్రజల్లో బలం ఉంటే సీటు ఇస్తే ఇవ్వొచ్చు.. లేదంటే లేదు
  • జగన్‌ గారికి వారికి కండువా కప్పి చంద్రబాబు మీద వ్యతిరేకత వచ్చేసింది అనే చిల్లర మాటలు ఎప్పుడైనా చెప్పాడా.?
  • పశువుల్లా కొనుగోలు చేశారు అంటూ చంద్రబాబు రోజూ చెప్తాడు..
  • మేమేమీ డబ్బులిచ్చి మాకు మద్దతు పలకమని వారిని చేర్చుకోలేదు
  • మేమేమీ కండువాలు కప్పలేదు.. మంత్రిపదవులు ఇవ్వలేదు..
  • ఈసారి చంద్రబాబు గెలవడు కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా అతనికి రాదు.. వస్తే వాళ్ల పార్టీకి రావచ్చు

సైకో అంటే చంద్రబాబు:

  • జగన్‌ గారు సంక్షేమం నేరుగా ఖాతాల్లోకి పడిపోతుంది..
  • స్కిల్‌ అంటూ 371 కోట్లు కొట్టేసి కన్నాలు వేసే వ్యక్తి చంద్రబాబు
  • ఇలాంటి 420 మాటలు ప్రజలు నమ్మితే 23 సీట్లు ఎలా వస్తాయి..?
  • నువ్వు దొంగని తెలిసిన తర్వాత రెండోసారి ప్రజలు నమ్మరు
  • సైకో అంటే చంద్రబాబు. సైకిల్‌ పార్టీ రావాలి కాదు పోవాలని   కొడాలి వెంకటేశ్వరరావు అన్నారు.

తాజా వీడియోలు

Back to Top