చంద్రబాబును నమ్మడమే ఎన్టీఆర్‌ చేసిన తప్పు

మాజీ మంత్రి కొడాలి నాని

ప్రజలను రెచ్చగొట్టేందుకే అమరావతి పేరిట యాత్ర

విశాఖలో భూకుంభకోణం జరిగిందని దుష్ప్రచారం

కొండలు తవ్వేస్తున్నారంటూ టీడీపీ నేతల గగ్గోలు

హైదరాబాద్‌లో కొండలు తవ్వి చంద్రబాబు, పవన్‌ ఇల్లు కట్టుకోలేదా? 

రామోజీ ఫిల్మ్‌సిటీ కొండల్లోనే కదా ఉంది

2024 ఎన్నికల్లో చంద్రబాబుకు రాజకీయ సమాధి కట్టాలి

రాజకీయాల్లోకి నన్ను హరికృష్ణ తీసుకొచ్చారు

అమరావతి రైతుల ముసుగులో జూనియర్‌ ఎన్టీఆర్‌ను తిట్టిస్తున్నారు

చంద్రబాబు, పవన్‌ నాటకాలను ఉత్తరాంధ్ర ప్రజలు చూస్తున్నారు

ఉత్తరాంధ్రపై విషం కక్కుతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లను బ్యాన్‌ చేయాలి

విజయవాడ: చంద్రబాబును నమ్మడమే ఎన్టీ రామారావు చేసిన తప్పు అని మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పిల్లనిచ్చిన ఎన్టీఆర్‌ను మోసం చేసిన చరిత్ర చంద్రబాదని, ఆయనకు ఏమాత్రం విశ్వాసం లేదన్నారు. తనను రాజకీయాల్లోకి తీసుకువచ్చింది హరికృష్ణ అని గుర్తు చేశారు. 
ప్రజలను రెచ్చగొట్టేందుకే అమరావతి పేరిట యాత్ర చేస్తున్నారని, 2024 ఎన్నికల్లో చంద్రబాబుకు రాజకీయ సమాధి కట్టాలని , ఉత్తరాంధ్రపై విషం కక్కుతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లను ఆ ప్రాంతంలో బ్యాన్‌ చేయాలని పిలుపునిచ్చాడు. గురువారం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.

ప్రజలను రెచ్చగొట్టేందుకే అమరావతి పేరిట యాత్ర చేస్తున్నారు. ఈ యాత్రలో సీఎం వైయస్‌ జగన్‌ను, మా మంత్రులను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. మాపై తొడలు కొట్టి, జబ్బలు చరుస్తున్నారు. టీడీపీ సభ్యులను పాదయాత్ర పేరుతో మా నియోజకవర్గాలకు పంపించి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయించడం, దాడులకు పాల్పడటం, ఆ తరువాత మాపై వ్యతిరేక ప్రచారం చేయడం ఒక పనిగా పెట్టుకున్నారు. అక్కడున్న ప్రజలు దండయాత్ర చేసి పాదయాత్ర మా ప్రాంతానికి వద్దు అని వ్యతిరేకిస్తుంటే సిగ్గులేకుండా టీడీపీ నేతలు అక్కడికి వెళ్లి రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. 

ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు, పవన్‌ ఏం చెబుతారు..వైజాగ్‌లో ఏదో కుంభకోణం బయట పడిందని, విజయ సాయిరెడ్డిగారి వియ్యంకుడు అక్కడేదో భూములు కొన్నారని అరబిందో భూములు ఆయనవే అన్నట్లుగా, అవి సీఎం వైయస్‌ జగన్‌వి అన్నట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారు. విజయసాయిరెడ్డి, వైయస్‌ జగన్‌కు సపోర్టుగా నాలాంటి వాళ్లు మాట్లాడితే ఇందులో కొడాలి నానికి వాటాలు ఉన్నాయని వార్తలు రాస్తున్నారు. రాజధాని కావాలని వీళ్లు అక్కడికి వెళ్తే..ఆ ప్రాంతంలో నాన్‌ పొలిటికల్‌ జేఏసీ ఉద్యమం చేస్తుంటే..దాన్ని మసిపూసి మారెడు కాయ చేసేందుకు దసపల్లా..రసగుల్లా అని రాస్తున్నారు. రుషికొండ గవర్నమెంట్‌ ల్యాండ్, అక్కడ ప్రభుత్వ నిధులతో భవనాలు కడుతున్నారు. జూబ్లీహిల్స్, బంజారహిల్స్‌లో కొండలు కాదా ఉండేది. కొండలు తవ్వి బిల్డింగ్‌లు కడితే తప్పేంటి..చంద్రబాబు, రామోజీరావు, పవన్‌ ఎక్కడ ఉంటున్నారు. వీరు కొండలపై కాదా ఇళ్లు కట్టుకుంది. దసపల్లా భూములు తీసుకొచ్చి విజయసాయిరెడ్డిని భూచిగా చూపారు. అరబిందో కంపెనీకి కొన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ప్రభుత్వానికి అరబిందో పన్నులు కడుతోంది. 2019లో అరబిందో వద్ద చంద్రబాబు చందాలు తీసుకోలేదా? . 2024లో చందాలు తీసుకోడా?. గుడికి వచ్చి ప్రమాణం చేయగలడా?.

అరబిందో మాకొక్కరికే సంబంధమా? . అరబిందోకు భూములు కేటాయించింది ఎవరు? ఆ కంపెనీలను ప్రోత్సహించింది వీళ్లు కాదా? సాయిరెడ్డి 2013లో వాళ్ల అమ్మాయిని అరబిందో వాళ్లకు ఇచ్చి వివాహం చేశాడు. అరబిందోను ప్రోత్సహించింది ఈ 420 చంద్రబాబు కాదా? ..తాను కాదని గుడిలో చంద్రబాబు ప్రమాణం చేయాలి. అరబిందోకు నాకు సంబంధం లేదని చంద్రబాబును చెప్పమనండి. వాళ్ల వద్ద చందాలు తీసుకుంటాడు. వాళ్లతోనే బతుకుతాడు. ఇప్పుడేమో డ్రామాలాడుతున్నారు. ఎవరికి పనిరాని దసపల్లా, రుషికొండ భూముల్లో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తుంటే వీరికి వచ్చిన నష్టం ఏంటో చెప్పాలి. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు, ప్రజలు ఈ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా చంద్రబాబుకు పళ్లు రాలిపోయేలా 2024లో 2019 కన్నా ఘోరాతి ఘోరంగా ఓడించాలి. చంద్రబాబును ఎన్నిసార్లు కొట్టినా, తిట్టినా ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా మూతిపళ్లు రాలిపోయినట్లు చేసినా చంద్రబాబుకు సిగ్గుశరం లేకుండా మాట్లాడుతున్నాడు. 420కి రాజకీయ సమాది కట్టాల్సిన అవసరం 2024లో ఉంది.

బాలకృష్ణ అన్ స్టాపబుల్ అనే ప్రోగ్రామ్‌కు చంద్రబాబును అతిథిగా పిలిచారు. చంద్రబాబు ఏం చెబుతాడు..చంద్రబాబు ఎన్టీ రామారావు కాళ్లు పట్టుకున్నాడని, మాదేమి తప్పు లేదని చెప్పారు. అంటే ఎన్టీఆర్‌ తప్పు చేశాడా? ఎన్టీఆర్‌ చేసిన తప్పేంటి?. రాష్ట్ర ప్రజలకు తెలియాలి కదా?. పార్టీ పెట్టడం ఎన్టీఆర్‌ చేసిన తప్పా? చంద్రబాబుకు పిల్లను ఇవ్వడం తప్పా? ఎన్టీఆర్‌ చేసిన తప్పేంటి?. 9 నెలల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడం తప్పా? వీళ్లందరికీ ఆస్తులు పంచిపెట్టడం తప్పా? వీళ్లందరికీ రాజకీయ జీవితం ఇవ్వడం తప్పా?. 420 నాకొడుకులకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం తప్పా? ఆయనపై చెప్పులు వేసి, వెన్నుపోటు పొడిచిన వ్యక్తులను చేరదీయడం తప్పా?.

లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోవడం తప్పు అంటే..ఆ రోజు తిరుపతిలో ఎన్టీఆర్‌ పెళ్లి చేసుకుంటే అక్షింతలు వేశారు కదా?ఆ రోజు అమ్మా అమ్మా అంటు వెంట తిరిగారు కదా? ఎన్నికల ప్రచారంలో లక్ష్మీపార్వతిని తిప్పుకోలేదా?. ఆ తరువాత తినడానికి ఎన్టీఆర్‌కు తిండి పెట్టింది ఎవరు?. ఎన్టీఆర్‌ తన పిల్లలందరికీ ఇళ్లు కట్టించి సెటిల్‌ చేశారు. ఆయనకు గుండె జబ్బు ఉంది. రకరకాల జబ్బులతో బాధపడుతున్న వ్యక్తికి తోడు కావాలని లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఎన్టీఆర్‌ ఏమిచ్చాడు. ఎమ్మెల్యే పదవి ఇచ్చాడా? చంద్రబాబుకు మంత్రి పదవి ఇచ్చాడు. ఎమ్మెల్యే సీటు ఇచ్చాడు. దగ్గుపాటి వెంకటేశ్వరరావుకు మంత్రి పదవి ఇచ్చాడు. పిల్లలకు ఆస్తులు ఇచ్చాడు. లక్ష్మీపార్వతికి ఒక ఇల్లు ఇచ్చాడా? భార్యగా ఆమెను పక్కన పెట్టుకోవడం తప్పా? బాత్‌రూమ్‌కు కూడా చంద్రబాబునే తీసుకెళ్లాలా? పదవి కోసం విశ్వాసం లేని కుక్కలాగా ఎన్టీఆర్‌ పక్కన చేరి కుక్క కన్నా ఘోరంగా చంద్రబాబు ఆయన్ను కరిచి చంపాడు. ఈ మాటలు నేను చెప్పలేదు..ఎన్టీఆరే ఆవేదనతో స్వయంగా చెప్పారు. చంద్రబాబు 420, ఔరంగజేబు, తిన్నింటి వాసాలు లెక్కపెడతాడు. నా కాళ్ల వద్ద కూర్చొని ఎన్టీఆర్‌ జిందాబాద్‌ అని వైజాగ్‌లో అరిచి, హైదరాబాద్‌ వచ్చి వైశ్రాయ్‌ హోటల్‌లో వెన్నుపోటుకు కుట్ర చేసి నా గొంతు కోసిన దుర్మార్గుడని ఎన్టీఆరే చెప్పారు. 

ఈ బాలయ్య ఏం చెబుతాడు..ఎన్టీఆర్‌ తప్పు చేశాడట..చంద్రబాబు తప్పక ఎన్టీ రామారావును దించేశాడట. మహానటుడు చెప్పేది వినాలి. ఇలాంటి వ్యక్తులను నమ్మడం ,ఇలాంటి వ్యక్తులను కనడం, ఇలాంటి 420కి పిల్లలను ఇవ్వడం, ఆస్తులు పంచడమే ఎన్టీఆర్‌ చేసిన తప్పు. ఇంతకంటే ఎన్టీఆర్‌ ఏ తప్పు చేయలేదు. ఆయన నూటికి నూరు శాతం నిప్పులాంటి వ్యక్తి. వీళ్లు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన దొంగలు ప్రెస్‌మీట్‌ పెట్టి నేను విశ్వాసం లేని కుక్కనని విజయవాడలో చెబుతున్నాడు. నేను విశ్వాసం ఉన్న కుక్కను రా కుక్క..చంద్రబాబు విశ్వాసం లేని గజ్జి కుక్క . ఎన్టీఆర్‌తో తిరిగి, ఆయనకు వెన్నుపోటుపొడిచి పదవిని, పార్టీని లాక్కున్న 420 చంద్రబాబు. నేను అలా కాదు. ఇందిరాగాంధీ వద్ద రెండుసార్లు సీట్లు తీసుకొని ఎమ్మెల్యే, మంత్రి పదవులు అనుభవించి కాంగ్రెస్‌ను భూస్థాపితం చేసిన ఎన్టీఆర్‌ పంచన చేసిన విశ్వాసం లేని కుక్క చంద్రబాబు. నన్ను రాజకీయాల్లోకి చంద్రబాబు తీసుకురాలేదు. నన్ను హరికృష్ణ తీసుకువచ్చాడు. ఆయన చచ్చే వరకు, ఆయన పాడే కాలే వరకు అక్కడే నిలబడ్డాను.

నాకు హరికృష్ణ దైవం, 1999లో గుడివాడలో హరికృష్ణ పోటీ చేశాడు. నేను టీడీపీని వదిలేసి హరికృష్ణతో తిరిగాను. విశ్వాసం లేని కుక్కలు మాట్లాడుతున్నాయి. నిమ్మకూరులో 2000 సంవతర్సంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఇండిపెండెంట్‌గా దాసరి అశోక్‌కుమార్‌ అనే వ్యక్తిని ఎంపీటీసీగా పెట్టి టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించాను. అదే సంవత్సరంలో ఎన్టీఆర్‌ అత్తగారి ఊరు కౌవులూరులో కృష్ణ అనే స్వతంత్ర అభ్యర్థిని గెలిపించాను. ఆరోజు దాసరి అశోక్‌ను ఎంపీపీని చేశాను. కాంగ్రెస్‌తో కలిసి నాకున్న నాలుగురు ఎంపీటీసీలతో ఎంపీపీ పదవి సొంతం చేసుకున్నాను. విశ్వాసం లేని కుక్కలు వాళ్లు. నేను హరికృష్ణ, ఎన్టీఆర్‌కు రుణపడి ఉంటాను. నాకు సీటు ఇప్పించిన వ్యక్తి జూనియర్‌ ఎన్టీఆర్‌. టీడీపీలో జూనియర్‌ ఎన్టీఆర్‌కు హక్కు ఉంది.

2009 ఎన్నికల్లో నాకు ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. నాకు, జూనియర్‌ ఎన్టీఆర్‌కు విభేదాలు ఉండవచ్చు. మేమిద్దరం మాట్లాడుకోలేకపోవచ్చు కానీ, మేమిద్దరం ఎప్పటికీ విశ్వాసంగానే ఉంటాం. ఎన్టీఆర్‌ను, జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతడు తిట్టినా కూడా మాట్లాడను, అతను చంపినా కూడా మాట్లాడను. ఎందుకంటే మాకు ఉపయోగపడిన వ్యక్తి, జూనియర్‌ ఎన్టీఆర్‌ అంటే నాకు ఇష్టం. చంద్రబాబు ఓ బిచ్చగాడిలా టీడీపీలో జాయిన్‌ అయి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన దొంగ 420 చంద్రబాబు. వీడు నాకు రాజకీయ భిక్ష పెట్టాడని, నేను విశ్వాసం లేని కుక్కను అని మాట్లాడడం సరికాదు. రెండుసార్లు సీటు ఇచ్చిన కాంగ్రెస్‌ను ఎందుకు వదిలేశాడు. మంత్రిని చేసిన ఎన్టీఆర్‌ను ఎందుకు వెన్నుపోటు పొడిచారు.

విశ్వాసం లేని కుక్క ఎవరు? నేనా? చంద్రబాబా?. నేను గుట్కా గాడిని అంటున్నాడు. చంద్రబాబు తాగుబోతు నా కొడుకా?. 24 గంటలు తాగుబోతే కదా?. నేను గుట్కా వేస్తానా? ఈ నా కొడుకులు నేను ఊస్తే డబ్బాలు పట్టుకుంటారా? వాడు తాగుబోతు కాబట్టే ప్లాస్టిక్‌ బాటిల్స్‌ వాడకుండా స్టీల్‌ డబ్బాలో పోసుకుని తాగుతుంటాడా?. పనికి రాని మాటలు మానుకోవాలి. పెద్ద ఎన్టీఆర్‌నే కాదు..చిన్న ఎన్టీఆర్‌ను వదలని రోతగాళ్లు వీరు. అమరావతి రైతుల ముసుగులో జూనియర్‌ ఎన్టీఆర్‌ను తిట్టిస్తున్నారు.

38 ఏళ్ల ఎన్టీఆర్‌ను చంపేయాలంటా? 73 ఏళ్ల వ్యక్తి మాత్రం బతికి ఉండాలట?.వాడి ఈక ముక్క కూడా నేను, వైయస్‌ జగన్‌ పీకలేమట. వాడికి బొచ్చు ఎక్కడ ఉంది?. మొన్న పీకి 23 సీట్లలో కూర్చోబెట్టారు. వెక్కివెక్కి ఏడ్చాడు. నీ కొడుకు సమకాలికుడు సొంతంగా పార్టీ పెట్టి నిన్ను ఇంటికి పరిమితం చేశాడు. ఇంతకంటే ఏం చేయాలి?. అసెంబ్లీలో కూర్చొని ఏడ్చి శోకాలు పెట్టావు. నీవు బాహుబలి అన్నట్లుగా మాట్లాడుతున్నావు. నీ బట్టలు ఊడబెరికి బెంజి కంపెనీ వద్ద నిలబెట్టినా నన్ను ఏం చేయలేరు అంటున్నాడు. ఇంకా ఏం చేయాలో నీవే చెప్పూ?. నీకు సిగ్గుశరం లేదు. నీతి జాతి లేదు. ఇలాంటి మిమ్మల్ని ఏం చేయాలి. నిమ్మకూరులో 2000 సంవత్సరంలో టీడీపీని ఓడించింది నేను. వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రభంజనంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలిచాను.

1989లో ఇక్కడ టీడీపీ నుంచి ఓడిపోయారు. నేను టీడీపీకి హార్డ్‌కోర్‌ కాదు..నేను ఎన్టీఆర్‌ ఫ్యామిలీకి మాత్రమే హార్డ్‌కోర్‌ను. హరికృష్ణతో అన్నా టీడీపీలో ఉన్నాను. ఆయనతోనే పార్టీ నుంచి బయటికి వచ్చాను. నా జోలికి రావద్దని టీడీపీ నేతలను కొడాలి నాని హెచ్చరించారు. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర రెండు పార్టీలు, మూడు టీవీల్లో తప్ప ఎక్కడా కనిపించడం లేదు. టీడీపీ, జనసేన జెండాలు పెట్టుకొని జై కొడుతూ తిరుగుతున్నారు. దాన్ని హైలెట్‌ చేస్తూ భూమి బద్దలైనట్లు చెప్పుకుంటున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలకు, జేఏసీలకు ఒక్కటే చెబుతున్నాను. ఈ 420 వాళ్లను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. మీ మీద విషం కక్కే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5ని భూస్థాపితం చేయాలని కొడాలి నాని విజ్ఞప్తి చేశారు. ఆ ప్రాంతంలో ఎల్లోమీడియాను బ్యాన్‌ చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఒక ప్రాంతాన్ని నాశనం చేసేలా కుట్రలు చేస్తున్న టీవీ చానల్స్, పేపర్లను బ్యాన్‌ చేయాలని ఉత్తరాంధ్ర ప్రజలను కోరారు.

 

Back to Top