ప్రజా తీర్పును గౌరవించాలి

మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

ప్రతి ఒక్కరిలో మానవత్వ దృక్పధం కలిగి ఉండాలి 

పేదవాడికి ఎప్పుడు మేము తోడుగా ఉంటాం 

రెచ్చ‌గోడితే.. రెచ్చిపోకండి.. రాత్రిలు వస్తాయి పగలు వస్తాయి 

విశాఖ‌:  ప్ర‌జా తీర్పును గౌర‌వించాల‌ని మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ పేర్కొన్నారు. ప్ర‌తి ఒక్క‌రిలో మాన‌వ‌త్వ దృక్ఫ‌థం ఉండాల‌ని సూచించారు. గురువారం గరివిడిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పార్టీ నాయకులతో మాజీ మంత్రి బొత్స స‌మీక్ష నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఎవరు దిగులు  చెంద‌వ‌ద్ద‌ని ధైర్యం చెప్పారు.   ఓటమి గెలుపు అనేవి సహజం.. మనం చేసినంతవరకు ఈ ఐదు సంవత్సరాలు అభివృద్ధి చేశామ‌న్నారు. రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి పథంలో నడిపించాం,  పేదవాడు తలెత్తుకొని విధంగా కృషి చేశామ‌న్నారు. 

ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని కోరుకున్నారు. ప్రజా తీర్పును గౌరవిద్దాం. కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని నాయకులను కూడా గౌరవిద్దాం అని అయన సూచించారు. ఈ ఐదు సంవత్సరాలలో ప్రజలకు ఎటువంటి నష్టం కలగకుండా రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించే దిశగా అధికారంలోనికి వచ్చే ప్రభుత్వం పనిచేస్తుంది కోరుకుందాం అని ఆయన తెలిపారు. 

అధికారం ఉన్నా..లేక‌పోయినా పేదవాడికి అండగా నిలుస్తామ‌ని మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు.    పేదవాడికి మేలు చేసే దిశగా కృషి చేస్తాం.  పార్టీ ఆదేశాల మేరకు జిల్లాలో కానివ్వండి నియోజవర్గంలో కానివ్వండి మండలంలో కానివ్వండి గ్రామాలలో కానివ్వండి ప్రతి ఇంటికి వస్తాం ప్రజా సమస్య తెలుసుకొని ఆ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు పోరాడుతూనే ఉంటాం అన్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరిలో కూడా మానవత్వం కలిగి ఉండాలనేదే నా ధ్యేయం అని ఆయన అన్నారు.మా ఇంటి తలుపు ఎప్పుడు తెరిచేఉంటాయి మీకు ఏఎ సమస్య వచ్చిన సరే నాకు ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు వెంటనే ఆదుకుంటాం అని అయన భ‌రోసా క‌ల్పించారు.

మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మనం అందించిన సంక్షేమం, అభివృద్ధి కన్నా మరింత సంక్షేమాన్ని కోరుకున్న ప్రజా తీర్పుని గౌరవిద్దామని అన్నారు. కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉండి, మునిపట్టిల మీ అందరి కష్టసుఖాల్లో అండగా నిలుస్తామని తెలియజేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేద్దాం, వారి తరపున మన గొంతును బలంగా వినిపిద్దామని అన్నారు.

బెల్లనా చంద్రశేఖర్ మాట్లాడుతూ... ఏదిఏదైనప్పటికి మీకు అండగా ఉంటాం మీకు అందుబాటులో ఉంటాం అని చెప్పి కార్యకర్తలలో భరోసా కలిపించారు.

యువ నాయకులు బొత్స సందీప్ మాట్లాడుతూ... మా కుటుంబాం ఎప్పుడు పేదవాడికి అండగా నిలిస్తుంది. మీ సమస్య ఏదైనా సరే మా చెయ్ అందించి ఆదుకుంటాం. నేను విజయనగరంలోనే వుంటా నా ఫోన్ నెంబర్ ప్రతి ఒక్కరిదగ్గర ఉంటుంది సమస్య వుంది అని ఫోన్ చేస్తే పరిష్కారం చేసే విదంగా కృషి చేస్తామ‌ని బొత్స సందీప్ అన్నారు. 

Back to Top