మేము ఓడినా... ప్రజలకు అన్యాయం జరగనివ్వం

మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి

నెల్లూరు:  ఎన్నిక‌ల్లో మేము ఓడినా ప్ర‌జ‌ల‌కు అన్యాయం జ‌ర‌గ‌నివ్వ‌మ‌ని మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి భ‌రోసా క‌ల్పించారు. 
సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలంలోని రిషి కళ్యాణమండపంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలతో  మాజీ మంత్రివర్యులు డాక్ట‌ర్‌ కాకాణి గోవర్ధన్ రెడ్డి స‌మావేశ‌మ‌య్యారు.

ఈ సంద‌ర్భంగా కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి ఏమ‌న్నారంటే..

  • ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారు.
  • వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో దేశంలోనే ఎక్కడా లేనటువంటి పరిపాలన సంస్కరణలు, పధకాలు ప్రవేశపెట్టారు.
  • నేడు అధికారం లేకున్నా, ప్రజలకు అండగా నిలవాలని వైయ‌స్ జ‌గ‌న్‌ పిలుపునిచ్చారు.
  • అన్ని వర్గాల ప్రజలకు మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నాం.
  • నెలరోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వ పోకడలు చూస్తే, ప్రజలను  మోసం చేసే విధంగా ఉంది.
  • చంద్రబాబు పరిపాలన అంతా వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడం తప్ప మరొకటి లేదు.
  • వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారు సచివాలయ వ్యవస్థను తీసుకొని రావడం విధ్వాంసమా..!
  • పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలన్నీ అందించడం విధ్వాంసమా..!
  • పేద, బలహీన వర్గాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు.
  • నా శక్తి మేర సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికీ అందించా..
  • సర్వేపల్లి నియోజకవర్గంలోని వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ఉండండి.
  • తెలుగుదేశం ప్రభుత్వం కొత్త సంస్కృతిని రాష్ట్రంలో తీసుకొని వచ్చింది.
  • వైయస్ఆర్ విగ్రహాలపై, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి చెందిన ఆస్తులపై దాడి చేసే వారిని, శంకుస్థాపన రాళ్లను ధ్వంసం చేసే వారిని తిరిగి వారి చేతనే పునర్నిర్మించే కార్యక్రమం చేపడుతాం.
  • సర్వేపల్లి నియోజకవర్గంలో "నేను అనే వాడ్ని ఉన్నంతకాలం ఎవ్వరికీ అన్యాయం జరగనివ్వను".
  • సర్వేపల్లి నియోజకవర్గంలో అందరం కలిసి కట్టుగా పనిచేసి, వైయస్ఆర్‌ర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి, పూర్వ వైభవాన్ని తీసుకొని వద్దామ‌ని కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి పిలుపునిచ్చారు.
Back to Top