మార్మోగుతున్న సోషల్‌ మీడియా

ఎక్స్‌లో వైయ‌స్ఆర్‌సీపీ నేతల పోస్టుల వెల్లువ..

సోష‌ల్ మీడియా వేదిక‌గా చంద్ర‌బాబును ప్ర‌శ్నిస్తున్న ప్ర‌జ‌లు

రెండు రోజులుగా ట్రెండింగ్‌

అమ‌రావతి:  హామీలు ఎగవేసి ప్రశ్నిస్తున్న వారిని కూటమి ప్రభుత్వం వేధిస్తోంది. ఈ ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హెచ్చ‌రించారు.  ట్విట్టర్‌లో పోస్టులు పెట్టినందుకు ప్రభుత్వం అరెస్ట్‌ చేయదలచుకుంటే ముందు తనతోనే ఆరంభించాలని వైయ‌స్‌ జగన్‌ సవాల్ చేశారు. పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు ప్ర‌జ‌లు కూడా చంద్ర‌బాబును ప‌శ్నించాల‌ని వైయ‌స్ జ‌గ‌న్ పిలుపునిచ్చారు. జ‌న‌నేత పిఉపుతో హామీలు అమలుచేయని చంద్రబాబును ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్నారు. రెండు రోజులుగా ఎక్స్ వేదిక‌గా చంద్ర‌బాబును ప్ర‌శ్నిస్తుండ‌టం ట్రెండింగ్ సృష్టిస్తోంది.

ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజలకు సూపర్‌సిక్స్‌ పేరుతో  ఇచ్చిన హామీల‌కు బ‌డ్జెట్‌లో నిధులు కేటాయించ‌కుండా మోసం చేసింది పార్టీ నాయ‌కులు మండిప‌డుతున్నారు. బడ్జెట్‌లో సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల‌కు నిధులు ఎగ్గొట్ట‌డం మోసం కాదా చంద్ర‌బాబు అంటూ నిల‌దీస్తున్నారు. రాష్ట్రంలోని యువత, మహిళలు, రైతులను మోసం చంద్ర‌బాబుపై 420 కేసు ఎందుకు పెట్ట‌కూడ‌ద‌ని అంద‌రూ ట్వీట్ చేస్తున్నారు.  

ఎక్స్ వేదిక‌గా ప్ర‌శ్న‌ల వ‌ర్షం..

చంద్ర‌బాబు గారు.. ప్రజలకు సూపర్‌సిక్స్‌ పేరుతో హామీలు ఇచ్చి బడ్జెట్లో ఎగ్గొట్టారు!

నువ్వు చేసింది మోసం కాదా?

యువతని మోసం చేశారు
మహిళలను మోసం చేశారు
రైతులను మోసం చేశారు

ఆడ‌బిడ్డ నిధి:
18 ఏళ్లు నిండిన‌ ప్ర‌తి మ‌హిళకు నెల‌కు రూ.1500ల చొప్పున ఏడాదికి రూ.18వేలు. 2.07 కోట్ల మంది మ‌హిళ‌ల‌కు రూ.37,313 కోట్లు ఇవ్వాలి.  ఎంత ఇచ్చావ్‌?

దీపం:
ప్ర‌తి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండ‌ర్లు. 1,54,47,061 క‌నెక్ష‌న్ల‌కు గాను రూ.4115 కోట్లు ఇవ్వాలి. ఎన్ని కోట్లు కేటాయించావ్‌?

త‌ల్లికి వంద‌నం:
ఎంత‌మంది పిల్ల‌లు ఉంటే అంత‌మందికీ ఏడాదికి రూ.15,000లు ఇస్తా అన్నావు. రాష్ట్రంలో 83 ల‌క్ష‌ల మంది పిల్ల‌ల‌కు  గాను రూ.12,450 కోట్లు ఇవ్వాలి. ఎంత మందికి ఇచ్చావ్‌?

అన్న‌దాత‌:
ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేల చొప్పున ఆర్థిక  సాయం అన్నావు. రాష్ట్రంలో 53.52 ల‌క్ష‌ల మంది రైతులకు గాను రూ.10,706 కోట్లు అవుతుంది. ఎంత ఇచ్చావ్‌?

ఉచిత బ‌స్సు ప్ర‌యాణం:
రాష్ట్రంలో మ‌హిళ‌ల ఉచిత బ‌స్సు ప్ర‌యాణానికి దాదాపు ఏడాదికి రూ.3వేల కోట్లు అవుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు అతీగ‌తీలేదు.

యువ‌గ‌ళం:
రాష్ట్రంలో 20 ల‌క్ష‌ల మంది యువ‌త‌కు ఉపాధి, నిరుద్యోగుల‌కు రూ.3వేలు ఇస్తా అన్నావ్‌. ఒక్కొక్క‌రికి ఏడాదికి రూ.36వేల చొప్పున రూ.7,200 కోట్లు ఇవ్వాలి? ఎప్పుడు ఇస్తావ్‌

50 ఏళ్లు పైబ‌డిన వారికి రూ.4వేలు పింఛ‌న్‌:
రాష్ట్రంలో 50 ఏళ్లు పైబ‌డిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారు దాదాపు 17 ల‌క్ష‌ల మంది ఉన్నారు. ఒక్కొక్క‌రికి  రూ.4వేల చొప్పున ఏడాదికి రూ.48వేలు ఇస్తా అన్నావ్. మొత్తం రూ.8,160 కోట్లు కావాలి. నువ్వు ఎంత ఇచ్చావ్. 

ప్రశ్నిస్తే కేసులు పెడతానంటున్నావు, అరెస్టులు చేస్తానంటున్నావు.
నాతో సహా మా వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్‌ మీడియా యాక్టివిస్టులు నిన్ను నిలదీస్తూ ఖచ్చితంగా పోస్టులు పెడతామంటూ హెచ్చ‌రిస్తున్నారు. 

జిల్లాల వారీగా ప్ర‌త్యేక టాస్క్‌ఫోర్స్ క‌మిటీలు

సోషల్‌ మీడియా కార్యకర్తలకు అండగా నిల్చేందుకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. 

అక్రమ నిర్బంధాలు, అరెస్టులకు గురవుతున్న సోషల్‌ మీడియా కార్యకర్తలకు మరింత అండగా ఉండేందుకు మాజీ సీఎం, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ ఆదేశాల మేరకు పార్టీ తరపున ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. 

సోషల్‌ మీడియా కార్యకర్తలకు న్యాయ సహాయం కల్పించడంతో పాటు, వారికి భరోసా ఇవ్వడం, వారిని పరామర్శిస్తూ ఆత్మస్థైర్యాన్ని పెంచడం కోసం ఈ బృందాలు పనిచే­స్తాయి. ఆయా జిల్లాల్లో పార్టీ నేతలు, సంబంధిత నా­యకులు, లీగల్‌సెల్‌ ప్రతినిధులను సమన్వ­యం చేసుకుంటూ ఈ బృందాలు పనిచేస్తాయి. 

Back to Top