అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఊరూరా రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇడుపులపాయలోని వైయస్ఆర్ ఘాట్ వద్ద మహానేతకు నివాళులర్పించారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్ విగ్రహానికి వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించి, కేక్ కట్ చేశారు. విశాఖలో వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. నల్లకాల్వ వద్ద వైయస్ఆర్ స్మృతివనంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో మహానేత విగ్రహానికి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రంలో.. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు తెలంగాణ రాష్ట్రంలో ఘనంంగా నిర్వహించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైయస్ఆర్ సీపీ కార్యాలయం, పంజగుట్టలోని మహానేత విగ్రహాలకు నివాళులర్పించారు.