ఫేక్‌ న్యూస్‌పై ఫ్యాక్ట్‌ చెక్‌

ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 

 
 
తాడేప‌ల్లి:  కొందరు ఆకతాయిలు, అవకాశవాదులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని అడ్డుకునేందుకు, ఫేక్ న్యూస్‌కు చెక్ పెట్టేందుకు ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ చెక్ వెబ్ సైట్‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రారంభించారు. శుక్ర‌వారం తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో వెబ్ సైట్‌ను ఆవిష్క‌రించి, దాని ప్ర‌త్యేక‌త‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ఇటీవ‌ల కాలంలో రాష్ట్రంలో ఓ వ‌ర్గం ఫేక్ న్యూస్ ప్ర‌చారం చేయ‌డంతో వాస్త‌వాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించేందుకు ఫ్యాక్ట్ చెక్ వెబ్ సైట్ దోహ‌ద‌ప‌డుతుంది. వాస్తవాలను అందించడంతోపాటు వెబ్‌సైట్‌లో ఫేక్, ఫ్యాక్ట్‌ అనే ప్రత్యేక ఫీచర్‌ ఏర్పాటు చేసింది. దేశ వ్యాప్తంగా ప్రచారంలో ఉన్న అంశాలకు సంబంధించిన వాస్తవాలను ప్రజల ముందు ఉంచేలా ఈ పోర్టల్‌ను ఉపయోగిస్తున్నారు. సోషల్‌ మీడియా, ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లలో అత్యంత నమ్మకం కలిగించేలా వైరల్‌ అవుతున్న వాటిని గుడ్డిగా నమ్మొద్దు. ఫ్యాక్ట్‌ చెక్‌ చేసుకునేందుకే వెబ్ సైట్‌ను అందుబాటులోకి తెచ్చామ‌ని,  సంస్థలు, మతాలు, కులాలు, రాజకీయ పార్టీలు, వ్యక్తులను కించపరిచేలా పోస్టింగ్‌లు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసు  ఉన్న‌తాధికారులు సూచించారు.

మీకు ఎక్కడ ఫేక్ వార్త కనిపించినా @FactCheckAPGov ట్విట్టర్ హ్యాండిల్ లేదా, https://www.facebook.com/FactCheckAPGov ఫేస్ బుక్ పేజీని ట్యాగ్ చేయండి.

వెబ్ సైట్ : https://factcheck.ap.gov.in/

తాజా వీడియోలు

Back to Top