ఉరవకొండ: రాష్ట్ర చరిత్రలోనే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అందించలేని విదంగా ఒక సీజన్ కు సంబంధించి ఇంత పెద్ద మొత్తం లో పంటల బీమా అనంతపురం జిల్లాకు మంజూరు కావడం గతంలో ఎన్నడూ చూడలేదని ఉరవకొండ నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. సోమవారం విడపనకల్ మండలం చీకులగురికి గ్రామంలో జిల్లా అధికార ప్రతినిధి వీరన్న, జెడ్పిటిసి హనుమంతు, మండల కన్వీనర్ బసన్న, నాయకులు భరత్ రెడ్డి తదితరులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నష్టపోయిన రైతులకు పంటల సవైయస్సార్ బీమా' ను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారని తెలిపారు. నిజంగా అనంతపురం జిల్లా రైతులకు రేపు పండుగాలాంటిదని పేర్కొన్నారు. చరిత్రలో ఇదే తొలిసారిగా ఒక సీజన్‌కు సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో పంటల బీమా పరిహారం అందించిన చరిత్ర గతంలో లేదన్నారు. 2021 ఖరీఫ్ సీజన్‌లో రికార్డు స్థాయి విస్తీర్ణంలో పంటలు సాగవ్వగా.. అకాల వర్షాలు, తుపాన్‌లు వరదల వల్ల వ్యవసాయ, ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లిందని దింతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నష్టపోయిన ప్రతీ రైతుకు పరిహారం అందించాలన్న సంకల్పంతో ప్రత్యేక బృందాల ద్వారా గ్రామ స్థాయిలో అంచనా వేసిన పంట నష్టం ఆదారంగా పరిహారం అందించేందుకు కృషి చేసారని చెప్పారు. రాష్ట్రం మొత్తం 2900 కోట్ల రూపాయలు బీమా మంజూరు కాగా ఒక్క అనంతపురం, పుట్టపర్తి జిల్లాలకు 925 కోట్ల రూపాయలు రావడం చిన్న విషయం కాదన్నారు. ఒకే సీజన్లో ఇంత పెద్ద మొత్తంలో గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. ఉచిత పంటల బీమా ద్వారా జగన్ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని చెప్పారు.ఇవే కాకుండా రైతుభరోసా, సున్నావడ్డీ రుణాలు తదితర కార్యక్రమాలకు ప్రభుత్వం వేలకోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. విత్తనాలు, ఎరువులు సబ్సిడీతో ఇస్తూ రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.దేశ చరిత్రలోనే మూడేళ్ల లో రైతులకు,వ్యవసాయానికి లక్ష కోట్ల రూపాయలకు పైగా ఇచ్చిన ఘనత ఒక్క వైయస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. ఒక్క పైసా ఖర్చు లేకుండా రైతులకు బీమా సౌకర్యం కల్పించి రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని సీఎం పెంచుతున్నారన్నారు.రైతుల కోసం ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలు కేవలం వైయస్ జగన్ చేస్తున్న మంచి పనులు చూసి ఓర్వలేక చేస్తున్నవే అన్నారు. పంటల బీమా ద్వారా నష్టపోయిన రైతుల ఖాతాల్లో రేపు నగదు జమ అవుతుండడంతో ఇక ప్రజలు తమను ఎక్కడ మరిచిపోతారో నని భయంతో లేని సమస్యపై రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు. ఏదిఏమైనా మరోసారి వైయస్ జగనన్న రైతు పక్షపాతిగా నిరూపించుకున్నారని విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు.