తిరుపతి: పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా మొదటి సారి మా జిల్లాకు వచ్చారు, ఆయన స్పీచ్‌లో మేం అనుకున్నది ఒకటి ..జరిగింది మరొకటి, వచ్చినవారంతా నిరాశగా వెనుదిరిగారని రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. తిరుపతిలోని తన నివాసంలో రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. కొరుముట్ల శ్రీనివాసులు ఏమన్నారంటే.. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా మొదటి సారి మా జిల్లాకు వచ్చారు, ఆయన స్పీచ్‌లో మేం అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి, వచ్చినవారంతా నిరాశగా వెనుదిరిగారు గ్రామ స్వరాజ్యం అంటే కమిట్‌మెంట్‌తో మాట్లాడతారు అనుకున్నాం కానీ అలాంటిదేం కనిపించలేదు వైయస్ జగన్ గారి హయాంలో భారతదేశంలో ఎక్కడాలేని విధంగా గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చారు, గ్రామ సచివాలయాలు, ఉద్యోగులు, ఆర్బీకేలు, వెల్‌నెస్ సెంటర్లు ఇలా ఇవన్నీ తీసుకొచ్చాం మీ హయాంలో మాటలే తప్ప చేతలు లేవు, గ్రామ స్వరాజ్యాన్ని నిర్వీర్యం చేశారు, మీ కూటమి ప్రభుత్వంలో దాడులు, దండయాత్రలు, ఆస్తుల ధ్వంసం, రెడ్‌బుక్ పాలన సాగుతోంది రైల్వేకోడూరులో 120 ఏళ్ళ చరిత్ర ఉన్న లూథరన్ చర్చిలో విధ్వంసం చేసి ఆక్రమించారు గ్రామాల్లో అభివృద్ది చేస్తే మంచిదే కానీ మీ నేతలే అన్నీ ఆక్రమించుకుంటున్నారు, మీరు గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి కాబట్టి దృష్టిపెట్టండి సూపర్ సిక్స్ హామీల్లో మీరు కూడా భాగస్వామి కదా 70 రోజులైనా ఆ ఊసే లేదు, మరెందుకు అమలుచేయడం లేదు. వైయస్ జగన్ గారి హయాంలో గ్రామాల రూపురేఖలు మారాయి, ప్రజలు ఇప్పుడిప్పుడే అర్ధం చేసుకుంటున్నారు, మీకు ఓటేసి తప్పు చేశామనే భావనలోకి వచ్చారు అన్నా క్యాంటిన్‌ల పేరుతో ప్రజలను అవమానిస్తున్నారు, మీకు మేం అన్నం పెడితే తింటున్నారనే విధంగా వారిని అవమానించడం సబబా వైయస్ జగన్ గారి ప్రభుత్వంలో విద్యార్ధులకు పౌష్టికాహారం ఇస్తే మీరు నిర్వీర్యం చేశారు మీరు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ప్రతి రోజూ దాంట్లో తిట్టుకుంటూ కూర్చోండి అంటూ కొరుముట్ల శ్రీనివాసులు వ్యాఖ్యానించారు.