కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లును వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది 

కర్నూలు మాజీ ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ 
 

క‌ర్నూలు జిల్లా: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లును వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంద‌ని కర్నూలు మాజీ ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ పేర్కొన్నారు. ఇది పార్లమెంటు లో వెనుక తీసుకోవాలి, వక్ఫ్ ప్రాపర్టీ అంటే అది అల్లాకు సంబంధించినది..ఓ ముస్లిం తన ధర్మం కోసం, సమాజ సంక్షేమ కోసం మేలు చేయడానికి ఇచ్చిన ప్రాపర్టీ..ఒక్కసారి ఇచ్చిన తరువాత ఎవరు కోనుగోలు, అమ్మాకాలు చేయరాదు..దీని నుంచి వచ్చే ఆదాయంతో సమాజం మేలు కోసం ఉపయోగించాలి..

  • ఈ బిల్లు వక్ఫ్ అర్థనికే మార్చే విధంగా ఈ బిల్లు కేంద్ర ప్రభుత్వం . వక్ఫ్ ముస్లిం ధర్మంలో ఉన్న ఒక్క అంశం, భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారంగా ధర్మానికి సంబంధించిన విషయాలను పూర్తిగా స్వేచ్ఛ తో ఆలోచించుకోవాలి..
  • రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ బిల్లులో అంశాలు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ కు పూర్తి అధికారం ఇవ్వడం, వక్ఫ్ బోర్డు ను పూర్తిగా నిర్వీర్యం చేయడం ఈ బిల్లులో పొందుపరిచారు.
  • వక్ఫ్ ట్రిబ్యునల్ కూడా ఈ బిల్లులో తీసే విధంగా ఉంది.
  • వక్ఫ్ బోర్డు లో నియామకాలను కూడా నామినేటెడ్ పద్దతి చేసి ఎన్నుకో బడే యంత్రాన్ని కూడా తీసి వేయడం, ఎంపీ, ఎమ్మెల్యేలు, మాజీ జడ్జి లను , ముస్లిం సోదరులను తీసి వేయడాన్ని ఈ బిల్లు లో పోందుపర్చారు.
  • ఇద్దరు వ్యక్తులను ఇతర మతస్తులను నామినేటెడ్ చేసేందుకు ఈ బిల్లు లో పొందుపరుచారు. ఇది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. రాజ్యాంగానికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారు.
  • పార్లమెంటులో ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి గారు వ్యతిరేకించారు. ఈ విషయాన్ని తము ముద్దతు ఇవ్వమని ప్రకటించారు.
  • ముస్లిం సోదరులకు సంబంధించిన సున్నితమైన విషయాన్ని పునరాలోచనలో చేయాలి..
  • తెలుగు దేశం పార్టీ ఎన్నికల ముందు ముస్లిం సమాజానికి ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి ఉండాలి.
  • ఈ బిల్లును వ్యతిరేకించాల్సింది పోయి మద్దతు ఇవ్వడం చాలా దారుణం, ఇది ముస్లింలు సోదరులు గమనిస్తున్నారు.
  • ఏ మాట ఇచ్చారో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ మాటకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేస్తున్నాము..
  • ఈ బిల్లును వ్యతిరేకించిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముస్లిం సోదరుల తరుపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము..
Back to Top