జీవీఎంసీ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన సీఎం

విశాఖ: కైలాసగిరిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన అనంతరం సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డాక్టర్‌ వైయస్‌ఆర్‌ సెంట్రల్‌ పార్కు చేరుకున్నారు. పార్కులో  దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి సీఎం వైయస్‌ జగన్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జీవీఎంసీ ఏర్పాటు చేసిన ఫ్లవర్‌ షో సందర్శించారు. ఆ తరువాత జీవీఎంసీ చేపట్టే రూ.905.05 కోట్ల పనులకు సెంట్రల్‌ పార్కులో సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపనలు చేశారు. రూ. 433 కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధి పనులకు, రూ. 52 కోట్లతో మున్సిపల్‌ స్కూళ్లలో నాడు – నేడు కార్యక్రమానికి, రూ. 109 కోట్లతో ఆర్కే బీచ్‌ అభివృద్ధి పనులకు, రూ. 9.5 కోట్లతో ముడసరలోవ రిజర్వాయర్‌ అభివృద్ధి పనులకు, రూ. 145 కోట్లతో స్మార్ట్‌ సిటీ పనులకు, రూ. 157 కోట్లతో అమృత్‌ వర్క్స్‌కు సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపనలు చేశారు. 
 

Back to Top