ఎన్నిక‌ల న‌గారా మోగించిన వైయ‌స్ జ‌గ‌న్‌

కాకినాడ స‌మ‌ర శంఖారావ స‌భ నుంచి ప్ర‌చారం ప్రారంభం

కాకినాడ‌:  సమర శంఖారావం వేదికగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎన్నికల నగారా మోగించి కాకినాడ నుంచి  ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడి నుంచే సమరశంఖం పూరించారు. బూత్‌ కమిటీ సభ్యులు, నేతలతో జరిగే సభలో పార్టీ శ్రేణులకు ఎన్నికల దిశానిర్దేశం చేసేందుకు కాకినాడ వేదిక‌గా త‌ల‌పెట్టిన స‌మ‌ర శంఖారావం స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్ ఢంకా కొట్టి న‌గారా మోగించారు.  అంత‌కు ముందు వేదికపై దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. కాగా సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు నిన్న‌నే ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేసింది. ఊహకందని విధంగా ఎన్నికల తేదీ ఖరారైంది. పోలింగ్‌కు నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఎన్నికల సంగ్రామానికి  తెరలేచింది. ఇంకేముంది సమర శంఖారావం వేదికగా విజయ ఢంకా మోగించారు.

Back to Top