నెల్లూరు: సంక్షేమాన్ని ప్రతి గడపకూ చేర్చిన ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే రాష్ట్ర ప్రజానీకమంతా ఉందని, 22 నెలల పాలనలోనే దేశంలోనే తిరుగులేని ముఖ్యమంత్రిగా పేరుప్రతిష్టలు పొందారని చిత్తూరు జిల్లా వైయస్‌ఆర్ సీపీ వ్యవహారాల ఇన్‌చార్జ్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో వైయస్‌ఆర్ సీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని అత్యధిక మెజార్టీతో గెలిపించి.. సంక్షేమ పాలనకు మరింత బలాన్ని చేర్చాలని కోరారు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో చిల్లకూరు మండలంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచార కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్లి కల్యాణ చక్రవర్తి, ఎమ్మెల్యేలు వరప్రసాద్, తోపుదుర్తి ప్రకాష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. నిరంతరంగా సంక్షేమ పథకాలు అమలు చేయడం సీఎం వైయస్ జగన్‌తోనే సాధ్యమవుతుందన్నారు. పంచాయతీ, మున్సిపాలిటీల్లో చూపిన ఆధరణ కంటే మరింతగా తిరుపతి ఉప ఎన్నికలో అత్యధిక మెజారిటీతో గురుమూర్తిని గెలిపించాలని ప్రజలను కోరారు.