`ఈనాడు` ఇన్ని అబ‌ద్ధాలా?

ఓర్వకల్లు విమానాశ్రయానికి తొలి స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి పేరు పెడతానని వైయ‌స్ జ‌గ‌న్ చెప్పి విస్మరించారని రెడ్డి సంఘం నాయకులు చంద్రబాబుకు ఫిర్యాదు చేసిన‌ట్టు ఈనాడు దిన ప‌త్రిక‌లో ప్ర‌చురించారు. 2021 మార్చి 25న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయాన్ని నాటి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అట్ట‌హాసంగా  ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. ఆ రోజు మీ ప‌త్రిక కూడా ఈ వార్త రాసింది. అలాగే 2021 మే 16న ఓర్వకల్లు విమానాశ్రాయానికి ఉయ్యాలవాడ పేరు పెడుతూ నాటి వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వం అధికారికంగా జీవో కూడా జారీ చేసింది. ఇవ‌న్నీ నిజాలు కావా? ఈనాడు కిర‌ణ్‌..చంద్ర‌బాబు చెవిలో చెప్పిన రెడ్డి సంఘం నాయ‌కులారా..ఒక్క‌సారి గ‌తాన్ని కూడా గుర్తు తెచ్చుకోండి. ఉయ్యాల‌వాడ పేరు పెట్టినందుకు నాడు మెగాస్టార్ చిరంజీవి సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు కూడా చెప్పారు. ఇంత‌క‌న్నా సాక్ష్యాలు ఇంకే కావాలి?

Back to Top