నాణ్యమైన విద్య అందించడమే మా లక్ష్యం

ఒక్కో విద్యార్థికి రూ.16 వందల విలువైన ‘జగనన్న విద్యా కానుక’ కిట్‌

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

కృష్ణా: స్కూళ్లలో డ్రాప్‌ అవుట్స్‌ తగ్గించడం, ప్రాథమిక స్థాయి నుంచి అత్యుత్తమ విద్యను అందించడమే లక్ష్యంగా వైయస్‌ జగన్‌ సర్కార్‌ ముందడుగులు వేస్తోందని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ఒక్కో విద్యార్థికి రూ.16 వందల విలువైన ‘జగనన్న విద్యా కానుక’ కిట్‌ను అందిస్తున్నామని అన్నారు. విద్యా కానుక కోసం రూ.650 కోట్లను ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యా కానుక కిట్లను పంపిణీ చేస్తామన్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేస్తున్నామని, నాడు–నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామని చెప్పారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు చదవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఆదిమూలపు సురేష్‌ వివరించారు. ‘జగనన్న విద్యా కానుక’ను జిల్లా కేంద్రాల్లో మంత్రులు, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారన్నారు. 

Back to Top