విజయనగరం: రాష్ట్రంలో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రామరాజ్యం, రాజన్న పాలన వచ్చిందని డిప్యూటీ సీఎం పుష్పాశ్రీవాణి పేర్కొన్నారు. విజయనగరంలో ఏర్పాటు చేసిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. అత్యంత వెనుకబడిన విజయనగరం జిల్లాలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఈ రోజు చారిత్రకమైన రోజుగా నిలిచిపోతుంది. సీఎం వైయస్ జగన్ పేదలందరికీ ఆ రోజు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నారు. ఈ జిల్లా ప్రజలందరూ కూడా వారు కట్టుకునే ఇళ్లలో మిమ్మల్ని తమ హృదయాల్లో చిరస్థాయిగా గూడు కట్టుకుంటారు. ముక్కొటి ఏకదశి రోజు, క్రిస్మస్ రోజు మీ ద్వారా దేవుడు పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారని భావిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమం ఎవరూ కూడా చేయలేదు. మహిళలకు ఎవరూ చేయని మంచి పనులు సీఎం వైయస్ జగన్ 73 వారాల్లో చేశారు. 73 ఏళ్ల వయస్సు ఉన్న వారు చేయనిది కేవలం 73 వారాల్లో చేసిన ఘనత వైయస్ జగన్‌దే. అమ్మ ఒడి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన వైయస్ జగన్‌కు ఎవరూ చాటిలేరు. 88 లక్షల మంది డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు రూ.27 వేల కోట్లు వైయస్ జగన్ అందించారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్కచెల్లెమ్మలకు వైయస్‌ఆర్ చేయూత ద్వారా 26.57 లక్షల మందికి ఆర్థికసాయం చేశారు. మహిళల భద్రత, రక్షణ కోసం దిశా చట్టాన్ని తీసుకువచ్చిన ఘతన వైయస్ జగన్‌ది. 73 ఏళ్ల స్వాతంత్య్రంలో ఎవరూ కూడా ఇలాంటి చట్టాలు చేయలేదు. 50 శాతం పనులు, పదవుల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చారు. ఓ గిరిజన మహిళకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది ఒక్క వైయస్ జగన్ మాత్రమే. 30 లక్షల ఇళ్ల పట్టాలు..28 లక్షల పక్కా ఇళ్ల నిర్మాణం..మహిళలకు వైయస్ జగన్ ఇచ్చే శాశ్వత హక్కు ఇచ్చారు. దేశానికే వైయస్ జగన్ ఆదర్శంగా నిలిచారు. గత సీఎం చంద్రబాబు మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. ఇళ్లు కట్టిస్తానని చెప్పారు. డ్వాక్రా రుణాలు మాఫీ అన్నారు. సున్నా వడ్డీకే రుణాలు అన్నారు. ఏవి ఇవ్వలేదు. మా సీఎం వైయస్ జగన్ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ రుణాలు ఇచ్చారు. నాడు వైయస్‌ఆర్ డ్వాక్రా అక్కాచెల్లెమ్మలను లక్షాధికారులను చేయాలని సంకల్పించారు. నేడు వైయస్ జగన్ దాన్ని నెరవేర్చుతున్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు కొందరికే సంక్షేమం, కొంత మందికే అభివృద్ధి అంటూ కొంత మందికే పరిమితం అయ్యారు. వైయస్ జగన్ పాలనలో అందరికీ ఒకేలాగ సంక్షేమం, ఒకేలా అభివృద్ధి అంటూ అందరిలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆరోజు పాదయాత్రలో మహిళలు వైయస్ జగన్‌కు బొట్టుపొట్టి ఆశీర్వదించారు. ఆ రోజు అన్న లాగా సమస్యలు విని..ఈ రోజు అమ్మలాగా పాలిస్తున్నారు. మీది ఏ పార్టీ అని అడగలేదు. మీకు ఏ కష్టం ఉంది,. మీది ఏ జెండా అని అడగలేదు..అందరికి అండగా ఉన్నారు. వైయస్ జగన్ ఎన్నికల సమయంలో ఒక మాట చెప్పారు. తాను రామరాజ్యం చూడలేదు.. రాజన్న రాజ్యం తెస్తానని మాట ఇచ్చారు. ఈ రోజు రామరాజ్యం..రాజన్న రాజ్యం కలిసి చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో మహిళా సాధికారత ఛాంపియన్, మహిళా పక్షపాత ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు హ్యాట్రాఫ్ అంటూ పుష్పశ్రీవాణి సెలవు తీసుకున్నారు.