సీఎం వైయస్‌ జగన్‌ను విమర్శించే అర్హత బాబుకు లేదు

 చంద్రబాబుపై డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఫైర్‌
 

అమరావతి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని విమర్శించే అర్హత చంద్రబాబుకు లేదని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఫైర్‌ అయ్యారు. వందేళ్లైనా జరగవేమోనన్న నిర్ణయాలు వైయస్‌ జగన్‌ వంద రోజుల్లోనే చేశారని తెలిపారు. చంద్రబాబు 14 ఏళ్లుగా సీఎంగా ఉండి చేయని సంస్కరణలను సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వంద రోజుల్లోనే చేశారని పేర్కొన్నారు.వంద రోజుల్లోనే లక్షా 33 వేలు ఉద్యోగాలిచ్చిన ఏకైక సీఎం వైయస్‌ జగన్‌ అని కొనియాడారు. నామినేటెడ్‌ పదవులు, పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు, మహిళలు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌ది అని పేర్కొన్నారు.  బాబు కలలో అయినా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల కోసం ఆలోచించారా అని ప్రశ్నించారు. పునరావాస కేంద్రాలని డ్రామాలాడుతున్న చంద్రబాబు నారాయణ కాలేజీల్లో 25 మంది ఆడపిల్లలు చనిపోతే ఎందుకు పెట్టలేదని నిలదీశారు. 

Back to Top