సీఎం వైయస్‌ జగన్‌కు రుణపడి ఉంటా

డిప్యూటీ సీఎం నారాయణస్వామి
 

చిత్తూరు: దళితుడినైన తనను రాజకీయంగా ప్రోత్సహించిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పేర్కొన్నారు. గురువారం చిత్తూరులో ఏర్పాటు చేసిన అమ్మ ఒడి కార్యక్రమంలో నారాయణస్వామి మాట్లాడారు. ప్రజా సంకల్ప యాత్రలో వైయస్‌ జగన్‌ అందరి సమస్యలు విన్నారు. పాదయాత్ర ముగిసి ఈ రోజుకు ఏడాది అవుతుంది. చిత్తూరు చరిత్రను మార్చింది వైయస్‌ జగనే. ఏ హృదయంలో చూసినా వైయస్‌ జగన్‌ ఉన్నారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. దళితులు ఊరికి దూరంగా ఉన్నారు. వారిని దగ్గర చేస్తూ..అంబేద్కర్‌ కన్న కలలను నెరవేర్చుతూ..రాజకీయంగా తనకు ప్రాధాన్యత ఇచ్చిన వైయస్‌ జగన్‌ రుణం తీర్చుకోలేను. బడుగు, బలహీన వర్గాలు ఒకప్పుడు స్కూళ్లకు దూరంగా ఉండేవాళ్లం. ఈ రోజు వైయస్‌ జగన్‌ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం తీసుకువస్తున్నారు. ప్రతి ఒక్కరూ నవరత్నాల ద్వారా బాగుపడాలని సీఎం నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ రోజు ఆర్థికంగా, రాజకీయంగా,విద్యాపరంగా వెనుకబడ్డాం. చంద్రబాబు ఇంగ్లీష్‌ మీడియాన్ని వ్యతిరేకించారు. గతంలో ఎంతో మంది క్రిస్టియన్‌ స్కూళ్లలో చదువుకున్నారు. వారు మతం మార్చుకున్నారా? ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలనే ఆలోచనతో వైయస్‌ జగన్‌ ఇంగ్లీష్‌ మీడియం తీసుకువస్తే..మత మార్పిడి అంటున్నారు. పేద పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తున్నారని, వైయస్‌ జగన్‌ కుటుంబాన్ని అందరూ ఆశీర్వదించాలని కోరారు. యుగపురుషుడు వైయస్‌ఆర్‌ నన్ను ఎమ్మెల్యేను చేశారు. జీడీ నెల్లూరును దత్తత తీసుకొని డిగ్రీ కాలేజీ, పాలిటెక్నిక్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని సీఎంను కోరారు. మా నియోజకవర్గాన్ని బాగు చేయాలని కోరుకుంటున్నానని నారాయణస్వామి విజ్ఞప్తి చేశారు. 
 

Back to Top