ప్ర‌తి ఒక్క‌రికీ వైద్య సేవ‌లు చేరువ చేస్తున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్  

 వైయ‌స్ఆర్‌సీపీ వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్‌

అభినంద‌న‌లు తెలిపిన ఎంపీ, ఎమ్మెల్యేలు, కుడా చైర్మ‌న్ కోట్ల హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డి, జిల్లా వైద్యులు

క‌ర్నూలు:  రాష్ట్ర ప్రజలకు సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి  కల్పిస్తున్న వైద్య సేవలు దేశంలో మ‌రెక్క‌డా లేవ‌ని , ప్ర‌తి ఒక్క‌రికీ వైద్య సేవ‌లు చేరువ చేస్తున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్ కొనియాడారు.  జ‌గ‌న‌న్న ఆరోగ్య  సుర‌క్ష కార్య‌క్ర‌మం ప్ర‌జ‌ల ఆరోగ్యానికి ర‌క్ష అని చెప్పారు.   ఫ్యామిలీ డాక్టర్‌ విధానం రాష్ట్ర ప్రభు­త్వం తీసుకున్న మంచి నిర్ణయమని, ఈ విధానం ద్వారా గ్రామస్థాయిలో ప్రజలకు వైద్యుల సేవలు అందించడం శుభప­రి­ణా­మం అని చెప్పారు.  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు వైఎస్ఆర్‌సీపీ వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్య‌క్షుడిగా డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్ ఎంపిక‌య్యారు. ఈ మేర‌కు కేంద్ర పార్టీ కార్యాల‌యం నుంచి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆదిమూల‌పు స‌తీష్‌ను క‌ర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్‌, ఎమ్మెల్యేలు హాఫీజ్ ఖాన్‌, కుడా చైర్మ‌న్ కోట్ల హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డి, జిల్లా వైద్యులు అభినంద‌న‌లు తెలిపారు.  ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్ మాట్లాడుతూ.. ఫ్యామిలీ డాక్ట‌ర్ విధానం ద్వారా ప్రతి ఒక్కరికీ వైద్య సేవలు చేరువ అవుతాయి.

రాష్ట్రంలో వంద శాతం విలేజ్‌ క్లినిక్స్‌ను హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లుగా అభివృద్ధి చేయడం చాలా మంచి విషయమ‌న్నారు. వీటి ద్వారా ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన వైద్య సేవలు అందుతు­న్నాయ‌ని చెప్పారు.గ్రామాల్లోనే 12 రకాల వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయ‌న్నారు. ఆరోగ్య కార్యక్రమాల అమలులో ఏపీ మిగతా అన్ని రాష్ట్రాలకంటే ముందుంద‌న్నారు.  ప్రజలకు ప్రైవేట్‌ కార్పొరేట్‌ ఆస్పత్రు­ల్లోనూ ఉచిత వైద్యం అందించడానికి ఆరోగ్యశ్రీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంద‌ని చెప్పారు.  ఆరోగ్య పథకాల‌ అమలుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెడుతున్నార‌ని, అందులో త‌న‌ను కూడా భాగ‌స్వామ్యం చేయ‌డం సంతోషంగా ఉంద‌న్నారు.

త‌న‌పై న‌మ్మ‌కంతో గ‌తంలో రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వి ఇచ్చార‌ని, ఆ ప‌ద‌వితో వైద్య విభాగాన్ని బ‌లోపేతం చేయ‌డంతో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ప‌దోన్న‌తి క‌ల్పించడం అదృష్టంగా భావిస్తున్నాన‌ని చెప్పారు. త‌న‌పై పెట్టిన బాధ్య‌త‌ల‌ను అంకిత‌భావంతో ప‌ని చేసి సీఎం వైఎస్ జ‌గ‌న్‌కు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తీసుకువ‌స్తాన‌ని డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్ తెలిపారు. త‌న అభ్యున్న‌తికి స‌హ‌క‌రిస్తున్న ప్ర‌తిఒక్క‌రికి స‌తీష్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. డాక్ట‌ర్ స‌తీష్‌ను అభినందించిన వారిలో  కర్నూలు వైయ‌స్ఆర్‌ సిపి వైద్య విభాగ జోనల్ ఇంఛార్జి డాక్టర్. హరికృష్ణా రెడ్డి, , కోడుమూరు నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సిపి నాయకులు గుజ్జుల లక్ష్మీకాంత్ రెడ్డి, స‌ర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, త‌దిత‌రులు ఉన్నారు.

Back to Top