శ్రీసత్యసాయి జిల్లా: కూటమి ప్రభుత్వ అరాచకాలకు భయపడొద్దని, వైయస్ఆర్‌సీపీ శ్రేణులకు పార్ట అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి అండగా ఉంటారని హిందూపురం నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక అన్నారు. బుధవారం హిందూపురంలోని పార్టీ కార్యాలయంలో వైయస్ఆర్‌సీపీ డిజిటల్ బుక్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం ఆరాచకాలు చేస్తోందని పేర్కొన్నారు. పరిపాలనకు పక్కన పెట్టి ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు బనాయిస్తోందని కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రజల తరఫున పోరాటం చేస్తున్నందుకువైయస్ఆర్‌సీపీ వారిని వేధిస్తోందన్నారు. డిజిటల్ బుక్‌లో తమ సమస్యలను నమోదు చేసుకుంటే అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కారిస్తామని మాజీ సీఎం, పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి హామీ ఇవ్వటం గొప్ప విషయమన్నారు. శ్రేణులు ఇబ్బందులు ఎదురైతే ఈ యాప్‌లో సమగ్ర వివరాలు నమోదు చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘని ,రాష్ట్ర కార్యదర్శి చౌలూరు మధుమతి రెడ్డి , సీనియర్ నాయకులు బాలాజీ మనోహర్, మున్సిపల్ వైస్ చైర్మన్లు , కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, వైస్ ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు,మండల కన్వీనర్లు, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. రామగిరిలో డిజిటల్ బుక్ ఆవిష్కరణ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు రామగిరి మండలంలో డిజిటల్ బుక్‌ను వైయస్ఆర్‌సీపీ మండల కన్వీనర్ మీనుగ నాగరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దుర్మార్గమైన పాలన రాష్ట్రంలో నడుస్తోందన్నారు. లోకేష్ రెడ్‌బుక్ పాలన చూస్తున్న మనకు త్వరలో డిజిటల్ బుక్ పాలన అందించేందుకు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం రాబోతోందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు వెంకట్ రెడ్డి, ఎంసీ పల్లి ఎంపీటీసీ రాము, నరసింహారెడ్డి, యూత్ కన్వీనర్ మణికంఠ తదితరులు పాల్గొన్నారు.