అభివృద్ధి - సంక్షేమమే ప్ర‌భుత్వ‌ లక్ష్యం 

విజ‌య‌న‌గ‌రం:  అభివృద్ధి, సంక్షేమ‌మే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ల‌క్ష్య‌మ‌ని డిప్యూటీ స్పీక‌ర్ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి అన్నారు. ఈ మూడున్న‌రేళ్ల‌లో ప్రజలకు అందించిన అభివృద్ధి -సంక్షేమ పాలనతో సగర్వంగా ప్రజల ముందుకు వెళ్తున్నామని  తెలిపారు. విజయనగరం 43వ డివిజన్ ఆర్టీసీ కాలనీ లో నూత‌నంగా నిర్మించిన సీసీ రోడ్డును కోలగట్ల వీరభద్ర స్వామి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఎన్నిక‌ల మేనిఫెస్టోను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఓ భ‌గ‌వ‌ద్గీత‌, ఖురాన్‌, బైబిల్‌లాగా భావించి, అందులోని 98 శాతం హామీల‌ను మూడేళ్ల‌లోనే నెర‌వేర్చార‌న్నారు. జ‌న‌వ‌రి 1వ తేదీన పింఛ‌న్ సొమ్ము రూ.2750ల‌కు పెంచి మ‌రో మాట‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నిల‌బెట్టుకున్నార‌న్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇంటి స్థలం మంజూరు చేసి ఇల్లు కట్టుకునే విధంగా ఆర్థిక చేయూత అందజేస్తున్నామన్నారు. నాడు- నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు -ప్రభుత్వ ఆసుపత్రుల రూపు రేఖలు మార్చామని వివరించారు. 

Back to Top